వీపు గోకుతూ నెలకు రూ.14 లక్షల సంపాదన! చిన్ననాటి జ్ఞాపకమే పెద్ద వ్యాపారం..

చిన్నప్పుడు వీపుపై దురద పెట్టినప్పుడు అమ్మమ్మ గానీ, తాతయ్య గానీ తమ చేతులతో ఎంతో ప్రేమగా, మెల్లగా గోకుతుంటే కలిగే ఆ ఉపశమనం మాటల్లో చెప్పలేనిది. ఆ హాయికి తెలియకుండానే కళ్లు మూతపడి మంచి నిద్ర కూడా పట్టేది. ఆ చిన్ననాటి మధుర జ్ఞాపకమే ఇప్పుడు చైనాలో పెద్ద బిజినెస్ ఐడియాగా మారడం విశేషం. థాయ్ మసాజ్‌లు, ఆయిల్ మసాజ్‌ల ట్రెండ్ ఎప్పుడూ ఉండేదే కానీ, కేవలం 'వీపు గోకడం' (ఇచ్-స్క్రాచింగ్) మాత్రమే ప్రధాన సర్వీస్‌గా పెట్టి ఒక వ్యాపార సామ్రాజ్యాన్నే సృష్టించాడు చైనాకు చెందిన ఓ  వ్యక్తి! 

వీపు గోకుతూ నెలకు రూ.14 లక్షల సంపాదన! చిన్ననాటి జ్ఞాపకమే పెద్ద వ్యాపారం..
Itch Scratching Business Earns Chinese Man Millions

Updated on: Sep 04, 2026 | 2:01 PM

చైనాలోని షెన్‌జెన్‌కు చెందిన 32 ఏళ్ల ఝాంగ్ షియావోకియావో తన వినూత్న వ్యాపార ఐడియాతో ఆశ్చర్యపరుస్తున్నాడు. శరీర దురదను గోకే వినూత్న సేవలను (ఇచ్-స్క్రాచింగ్) ఒక ప్రాఫిటబుల్ బిజినెస్‌గా మలచి, ప్రస్తుతం రెండు అవుట్‌లెట్ల ద్వారా నెలకు రూ. 14 లక్షల (1,00,000 యువాన్లు) వరకు ఆర్జిస్తున్నాడు. ఆధునిక జీవనశైలిలో ఒంటరితనం, చేతులు అందక ఇబ్బంది పడే వీపు భాగాలపై దురద తీర్చుకోవడానికి ఈ సేవలు ఒక మంచి ఉపశమనంగా మారుతుండటంతో దీనికి ఊహించని స్థాయిలో ఆదరణ లభిస్తోంది. షెన్‌జెన్‌లోని బావోవాన్, ఫుటియాన్ జిల్లాల్లో ఝాంగ్ కు రెండు స్టోర్లు ఉన్నాయి. తన వ్యాపారాన్ని చైనా వ్యాప్తంగా 100 అవుట్‌లెట్లకు విస్తరించాలని ప్లాన్‌ చేస్తున్నాడట.

Zhang Xiaoqiao In Shenzhen Offers Itch Scratching Session

ఈ సేవను పొందేందుకు వినియోగదారులు గంటకు దాదాపు 300 యువాన్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 3,500 నుంచి రూ. 4,200 వరకు) చెల్లిస్తున్నారు. సాధారణ మసాజ్‌ల కంటే భిన్నంగా, కేవలం వీపు దురదను గోకడం ద్వారా ఒత్తిడిని తగ్గించి,  గాఢ నిద్ర పట్టేందుకు సహాయపడుతుందని కస్టమర్లు చెబుతున్నారు. ఆధునిక నగరాల్లో ఒంటరిగా నివసించే ఉద్యోగులకు ఇలాంటి వినూత్న వ్యక్తిగత సేవలు శారీరక ఉపశమనంతో పాటు మానసిక ప్రశాంతతను ఇస్తుండటంతో వీటికి డిమాండ్ పెరుగుతోంది. ఈ వినూత్న సేవలను పొందుతున్న వారిలో పురుషులే అత్యధికంగా 70 శాతం వరకు ఉంటున్నారని ఝాంగ్ తెలిపారు. సాధారణ మసాజ్‌ల కంటే ఈ సేవ మరింత ఎక్కువ ప్రశాంతతను ఇస్తుందని కొంతమంది కస్టమర్లు తమకు చెప్పినట్లు ఝాంగ్ అన్నారు. ఈ విభిన్నమైన అనుభూతి కారణంగా తమ వద్దకు పదే పదే వచ్చే రిపీటెడ్ కస్టమర్లు ఎక్కువగానే ఉన్నారని తెలిపారు.

 

సర్వీస్ ఎలా ఇస్తారంటే?

 

కస్టమర్లు మసాజ్ సెంటర్లలో లాగా బెడ్‌పై పడుకుంటారు. ప్రత్యేకంగా రూపొందించిన పదునైన గోళ్లతో  అక్కడున్న సిబ్బంది శరీర భాగాలను సున్నితంగా గోకుతారు. అది కస్టమర్ల మానసిక ఒత్తిడిని కూడా తగ్గించి, మంచి నిద్ర పట్టడానికి సహాయ పడుతుంది.  సోషల్ మీడియాలో ఒక మహిళ తన భర్త వెన్ను గోకుతున్న వీడియో , చిన్నతనంలో తన తండ్రి తనకు గోకిన అనుభూతిని గుర్తుచేసుకుని ఝాంగ్ ఈ వ్యాపార ఆలోచనను ప్రారంభించారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో ఓ మహిళ తన భర్త వెన్ను గోకుతుండటాన్ని ఝాంగ్ గమనించారు. ఆ దృశ్యం చూసిన వెంటనే అతనికి చిన్నతనంలో తండ్రి తన వీపు గోకిన మధురమైన జ్ఞాపకాలు, ఆ ప్రశాంతమైన అనుభూతి గుర్తుకువచ్చాయి. ఆధునిక సమాజంలో చాలా మంది ఒంటరిగా జీవిస్తుండటం వల్ల ఈ చిన్న ఆనందానికి కూడా దూరమవుతున్నారని గ్రహించి, దీన్నే ఒక లాభసాటి వ్యాపార ఆలోచనగా మార్చాలని నిర్ణయించుకున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us