మరి ఇంత దారుణమా.. 9 ఏండ్లకే బాలికలకు పెళ్లి..ఎక్కడో తెలుసా?

|

Nov 10, 2024 | 5:28 PM

Iraq: తొమ్మిదేళ్ల వయసున్న బాలికలను పురుషులు పెళ్లి చేసుకునేందుకు వీలు కల్పించే చట్టాన్ని ఇరాన్ సవరించనున్నట్లు తెలుస్తుంది. వివాహ చట్టానికి ఇరాక్ సవరణలను చేస్తే మహిళలకు విడాకులు, పిల్లల సంరక్షణ వారసత్వ హక్కులన్ని తొలగిపోనున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

మరి ఇంత దారుణమా.. 9 ఏండ్లకే బాలికలకు పెళ్లి..ఎక్కడో తెలుసా?
Iraq To Amend Marriage Laws Allowing Men To Marry Even 9 Year Old Girls
Follow us on

తొమ్మిదేళ్ల వయసున్న బాలికలను పురుషులు పెళ్లి చేసుకునేందుకు వీలు కల్పించే విధంగా ఇరాక్ వివాహ చట్టానికి చట్టపరమైన సవరణలను ఆమోదించనున్నట్లు తెలుస్తుంది. ఈ చట్టం చేస్తే మహిళలు విడాకులు, పిల్లల సంరక్షణ, వారసత్వ హక్కులను కూడా కోల్పోతారని సమాచారం. సంప్రదాయవాద షియా ముస్లిం పార్టీల సంకీర్ణం ఆధిపత్యంలో ఉన్న ఇరాక్ పార్లమెంట్ “వ్యక్తిగత స్థితి చట్టం”ను తారుమారు చేసిందుకు రంగం సిద్దం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దీనిని  188 చట్టం అని కూడా పిలుస్తారు. ఇది 1959లో ప్రవేశపెట్టారు. ఈ చట్టాన్ని ఇరాక్‌లోని షియా పార్టీలు సవరించడానికి ప్రయత్నించడం ఇదే మొదటిసారి ఏం కాదు – 2014 మరియు 2017లో దీన్ని మార్చడానికి ప్రయత్నాలు చేయగా అవీ విఫలమయ్యాయి. ఒకవేళ ఇరాక్ పార్లమెంట్ “వ్యక్తిగత స్థితి చట్టం”ను సవరిస్తే దేశంలోని మహిళలకు ఉన్న ముఖ్యమైన హక్కులు అన్ని తొలగిపోతాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇరాక్ పార్లమెంట్ తాజా సవరణలపై ఓటింగ్‌కు ముందు అధికారికంగా చర్చిస్తుంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయంపై నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  “పిల్లల అత్యాచారాలను చట్టబద్ధం చేయడానికి” ఇరాక్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. UNICEF ప్రకారం, అధిక బాల్య వివాహాల రేట్లు ఇప్పటికే ఇరాక్‌లో భారీగా ఉంది. దాదాపు 28% ఇరాక్ అమ్మాయిలు 18 సంవత్సరాల వయస్సులోపు వివాహం చేసుకున్న వారే ఉండడం గమనార్హం. ఆగస్టులో బాగ్దాద్ మరియు దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో ఈ చట్టం సవరణలపై నిరసనలు చెలరేగాయి. వ్యక్తిగత హోదా చట్టాన్ని సవరించడాన్ని వ్యతిరేకిస్తూ ఇరాక్ మహిళాలు నిరసన ప్రదర్శనలు కూడా చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి