Ali Larijani: ఇరాన్ సెక్యూరిలీ చీఫ్‌ను లేపేశాం.. ఇజ్రాయెల్ సంచలన ప్రకటన!

పశ్చిమాసిలో యుద్ధం రోజురోజుకూ మరింత హీటెక్కుతుంది. గడిచిన 24 గంటల్లోనే ఇద్దరు ఇరాన్‌ టాప్‌ కమాండర్లను ఇజ్రాయెల్‌ మట్టుబెట్టినట్టు తెలిపింది. తమ దాడిలో ఇరాన్‌ టాప్‌ సెక్యూరిటీ చీఫ్‌ అలీ లారిజాని, అతని కుమారుడు, బాడీగార్డులు మృతి చెందినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అటు ఇరాన్ స్టేట్‌ మీడియా కూడా ఇజ్రాయెల్ దాడిలో సెక్యూరిటీ చీఫ్‌ సహా అతని కుమారుడు మృతి చెందినట్టు దృవీకరించింది.

Ali Larijani: ఇరాన్ సెక్యూరిలీ చీఫ్‌ను లేపేశాం.. ఇజ్రాయెల్ సంచలన ప్రకటన!
Ali Larijani Death

Updated on: Mar 18, 2026 | 10:40 AM

పశ్చిమాసిలో యుద్ధం రోజురోజుకూ మరింత హీటెక్కుతుంది. గడిచిన 24 గంటల్లోనే ఇద్దరు ఇరాన్‌ టాప్‌ కమాండర్లను ఇజ్రాయెల్‌ మట్టుబెట్టినట్టు తెలిపింది.తమ దాడిలో ఇరాన్‌ టాప్‌ సెక్యూరిటీ చీఫ్‌ అలీ లారిజాని, అతని కుమారుడు, ఇరాన్‌ పార్లమెంటరీ ఫోర్స్‌ కమాండర్‌ గొల్మరెజా సొలేమాని మృతి చెందినట్టు ప్రకటించింది. అటు ఇరాన్ మీడియా సైతం ఈ ఇద్దరి మృతిని ధ్రువీకరించింది. అలీ ఖమేనీ మృతి తర్వాత IRGCని లారిజాని దగ్గరుండి నడిపిస్తున్నారు. ఇప్పుడు లారిజానిని కూడా ఇరాన్ అంతం చేయడంతో ఇరాన్‌కు కోలుకోలేని నష్టం జరిందనే చెప్పాలి. వీరి మృతి తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యూహు కీలక ప్రకటన చేశారు. ఇరాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకోవాలని పిలుపు నిచ్చారు.

ఇదితా ఉండగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ సైతం ప్రతీకార దాడులకు పాల్పడుతుంది. ఇజ్రాయెల్‌పై క్లస్టర్‌ బాంబులతో ఇరాన్‌ దాడులు పాల్పడింది. ఇరాన్ సందించిన వందలాది క్లస్టర్‌ బాంబులు ఒక్కసారిగా ఇజ్రాయెల్‌లోని నగరాలపైకి దూసుకొచ్చాయి. ఇరాన్ చేసిన దాడిలో ఇద్దరు పౌరులు చనిపోయినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. కాగా ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌లో 14 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే గత19 రోజులుగా కొనసాగుతున్న ఇరాన్‌-ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధంతో ఇప్పటివరకు ఇరాన్‌లో 3వేలు, లెబనాన్‌లో 900మందికి పైగా మృతి చెందారు.

అయితే ఇజ్రాయెల్ మాత్రమే కాదు అటు UAEపై కూడా మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడుతుంది ఇరాన్‌. అటు యూఏఈ సైతం వాటిరి సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఇరాన్ నుంచి వచ్చిన డ్రోన్లను గాల్లోనే నిర్వీర్యం చేస్తున్న UAE ఎయిర్‌ డిఫెన్స్‌. ముఖ్యంగా దుబాయ్‌లోని ప్రధాన ప్రాంతాలైన ఖతార్‌, బహ్రెయిన్‌, కువైట్‌ పై డ్రోన్లతో దాడులకు పాల్పడుతుంది. ఇప్పటివరకు సుమారు 2వేలకు పైగా మిసైళ్లు, డ్రోన్లతో UAEపై ఇరాన్‌ దాడులు చేసింది. దానికి దీటుగానే యూఏఈ సైతం 90శాతానికి పైగా దాడులను ఇంటర్‌సెప్ట్‌ చేసింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us