ఎయిర్‌పోర్టులో ఒక్కసారిగా మోగిన సైరన్స్.. ప్రయాణికుల్లో టెన్షన్ టెన్షన్.. అసలు ఏం జరిగిందంటే?

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక్కసారిగా మోగిన ఎయిర్ రెయిడ్ సైరన్లు ప్రయాణికులను వణికించాయి. ఇరాన్ నుంచి దూసుకొస్తున్న మిస్సైళ్లు, డ్రోన్ల ముప్పుతో దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎయిర్‌పోర్ట్‌లోని ప్రయాణికులు, సిబ్బందిని ప్రాణరక్షణ కోసం హుటాహుటిన అండర్ గ్రౌండ్ బాంబ్ షెల్టర్లలోకి తరలించారు.

ఎయిర్‌పోర్టులో ఒక్కసారిగా మోగిన సైరన్స్.. ప్రయాణికుల్లో టెన్షన్ టెన్షన్.. అసలు ఏం జరిగిందంటే?
Dubai Airport Evacuation

Updated on: Mar 10, 2026 | 3:41 PM

అమెరికా, ఇజ్రాయెల్‌తో జరుగుతున్న భీకర పోరులో భాగంగా.. ఇరాన్ దళాలు ఇప్పుడు గల్ఫ్ దేశాలపైనా గురిపెట్టాయి. మంగళవారం ఉదయం దుబాయ్ వైపు మిస్సైళ్లు వస్తున్నాయన్న యూఏఈ ఎయిర్ డిఫెన్స్ వార్నింగ్‌తో క్షణాల్లో ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లను ఖాళీ చేయించారు అధికారులు. దాదాపు ముప్పై నిమిషాల పాటు దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలను ఎక్కడికక్కడ పూర్తిగా నిలిపివేశారు. ఎప్పుడూ వేలాది మందితో కళకళలాడే చెక్-ఇన్ కౌంటర్లు.. ఒక్కసారిగా బోసిపోయిన భయానక దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఎట్టకేలకు ముప్పు తప్పిందని అధికారులు క్లియరెన్స్ ఇచ్చాకే. తిరిగి ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్ ప్రారంభించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు యూఏఈపై ఏకంగా పదిహేను వందలకు పైగా దాడులు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాణభయంతో అందరం షెల్టర్ల వైపు పరుగులు తీశామని ఆ అరగంట సేపు నరకం చూశామని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భద్రతకు మారుపేరుగా ఉండే దుబాయ్‌కే ఇలాంటి ముప్పు పొంచి ఉండటంతో అక్కడ ఉంటున్న లక్షలాది మంది భారతీయుల్లో భయం మొదలైంది.అణు క్షణమూ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్న జనాలకు ఈ యుద్ధం ఇంకెన్ని కన్నీళ్లు మిగులుస్తుందోనని ప్రపంచం ఉత్కంఠగా చూస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us