US Green Card: అమెరికా గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు గుడ్ న్యూస్ తెలిపింది. ప్రస్తుత ఉన్న పరిమితులను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది యూఎస్ (US Congress) కాంగ్రెస్ హౌస్ జ్యుడీషియరీ కమిటీ. అగ్రరాజ్య ఇమిగ్రేషన్ (Immigration)నిబంధనల్లో మరిన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉద్యోగ ఆధారిత ఇమ్మిగ్రెంట్ వీసాల విషయంలో అమెరికా (America) గ్రీన్ కార్డుల జారీ విషయంలో ప్రస్తుతం ఉన్న దేశాల వారీ పరిమితిని ఎత్తేస్తున్నారు. ఈ దిశగా కీలకమైన బిల్లుకు ఆమోదం తెలిపింది అమెరికా కాంగ్రెస్ హౌస్ జ్యుడీషియరీ కమిటీ. కుటుంబ ఆధారిత ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించిన పెర్కంట్రీ క్యాప్‌ను పెంచనున్నారు. ప్రస్తుతం ఇది 7 శాతంగా ఉండగా దానిని 15 శాతానికి పెంచాలని హౌస్ కమిటీ సూచించింది.
హెచ్ఆర్3648 లేదా ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్‌కార్డ్స్ ఫర్ లీగల్ ఎంప్లాయ్మెంట్ –యాక్ట్ అనేఈ బిల్లుపై హౌస్ జ్యుడీషియరీ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 22 ఓట్లు, వ్యతిరేకంగా 14 ఓట్లు వచ్చాయి. యూఎస్ సెనేట్ కూదా దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. అక్కడ కూడా చర్చ తర్వాత ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత బిల్లును అధ్యక్షుడు జో బైడెన్ఆమెదించాక చట్టరూపం దాల్చనుంది.
అమెరికాలో ప్రస్తుతం ఉద్యోగుల కొరతను దృష్టిలో పెట్టుకుని ఈ బిల్లును ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. ఇది చట్టరూపం దాల్చి, అమల్లోకి వస్తే భారతీయులు అత్యధికంగా లబ్ది పొందే అవకాశం ఉందని చెబుతున్నారు.. ముఖ్యంగా హెచ్-1బీ వీసాపై పనిచేస్తున్న ఉద్యోగులకు ఇది ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంది. వీరిలో ఎంతో మంది దశాబ్దాలుగా గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల్లో 71.9% చైనా, భారత్‌లకు చెందినవారే. భారతీయ విద్యార్థుల సంఖ్య 2021లో 12 శాతం పెరిగింది. చైనా నుంచి వెళ్లినవారి సంఖ్య 8 శాతానికిపైగా తగ్గింది.ఇ
ఇవి కూడా చదవండి: