Russia-Ukraine Crisis: ఉక్రెయిన్ నుంచి భారతీయ పౌరులు, విద్యార్థుల తరలింపు ప్రారంభం

Russia-Ukraine Crisis: ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం కారణంగా ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన తెలుగు విద్యార్థులు క్షణ క్షణం గండంలా బ్రతుకుతున్నారు.. ఎప్పుడు..

Russia-Ukraine Crisis: ఉక్రెయిన్ నుంచి భారతీయ పౌరులు, విద్యార్థుల తరలింపు ప్రారంభం

Updated on: Feb 26, 2022 | 4:33 PM

Russia-Ukraine Crisis: ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం కారణంగా ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన తెలుగు విద్యార్థులు క్షణ క్షణం గండంలా బ్రతుకుతున్నారు.. ఎప్పుడు ఏమి జరుగుతుందే ఎక్కడ ఏ బాంబ్ పేలుతుందోనని ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు కేంద్రం కూడా వారిని రప్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ చిక్కుకున్న విద్యార్థులతో పాటు ఇతరులను భారత్‌కు తీసుకువచ్చేందుకు మూడు విమానాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

విద్యార్థులను దేశానికి తిరిగి తీసుకువచ్చే ఖర్చులు తామే భరిస్తామని వెల్లడించిన విషయం విధితమే. ఉక్రెయిన్‌ నుంచి ఎయిరిండియా తొలి విమానం 219 మంది భారతీయులను ముంబై తీసుకువచ్చేందుకు బయలుదేరిందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ తెలిపారు. కాగా, ఉక్రెయిన్ నుంచి తరలిస్తున్న 470 మంది భారతీయ విద్యార్థుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 22 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే కేరళ నుంచి 17, తమిళనాడు నుంచి నలుగురు విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

 

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us