India behind: ఎంతటి స్వావలంభన సాధించినా ‘ఆ’ విషయంలో ఇంకా పాకిస్తాన్ కంటే భారత్ వెనుకే..!

|

Jun 15, 2021 | 3:04 PM

మన దేశం ఎన్నో రంగాల్లో పాకిస్తాన్ కంటే మెరుగ్గా కనిపిస్తుంది. బలమైన ఆర్థిక వ్యవస్థ.. సుస్థిరమైన ప్రభుత్వాలు.. భారీ సైనిక సంపత్తి.. ఇలా ఏ అంశంలో చూసినా మనం పాకిస్తాన్ కంటే ఎంతో బెటర్ పొజిషన్‌లో వున్నాం.

India behind: ఎంతటి స్వావలంభన సాధించినా ‘ఆ’ విషయంలో ఇంకా పాకిస్తాన్ కంటే భారత్ వెనుకే..!
Follow us on

India behind Pakistan in a particular issue: మన దేశం ఎన్నో రంగాల్లో పాకిస్తాన్ కంటే మెరుగ్గా కనిపిస్తుంది. బలమైన ఆర్థిక వ్యవస్థ.. సుస్థిరమైన ప్రభుత్వాలు.. భారీ సైనిక సంపత్తి.. ఇలా ఏ అంశంలో చూసినా మనం పాకిస్తాన్ కంటే ఎంతో బెటర్ పొజిషన్‌లో వున్నాం. కానీ తాజాగా వెల్లడైన ఓ అధ్యయనం ప్రకారం భారత్ ఓ విషయంలో పాకిస్తాన్ కంటే వెనుకబడే వుంది. చైనా, పాకిస్తాన్‌లతో ఆ విషయంలో భారత్ వెనుకబడి వుండడానికి కారణాలను కూడా విశ్లేషించిందా అధ్యయన సంస్థ.

మన దేశం అణ్వస్త్ర సామర్థ్యాన్ని సముపార్జించుకుని 47 ఏడేళ్ళయ్యింది. ఇందిరా గాంధీ హయాంలో మనదేశం తొలిసారి అణ్వస్త్ర సామర్థ్యాన్ని సముపార్జించుకుంది. ఆ తర్వాత దాదాపు 24 ఏళ్ళ తర్వాత అడ్వాన్స్డ్ న్యూక్లియర్ ప్రయోగాన్ని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో నిర్వహించింది. ప్రోఖ్రాన్‌లో జరిపిన ఆనాటి అణ్వస్త్ర ప్రయోగం భారత్‌ను న్యూక్లయిర్ పవర్ కంట్రీస్‌ ఒకదానిగా నిలిపింది. 1998 న్యూక్లియర్ టెస్టు కారణంగా మనదేశంపై అమెరికా ఎన్ని ఆంక్షలను పెట్టినా .. వాటిని అధిగమిస్తూ భారత్ ముందుకు సాగుతోంది.

అయితే, తాజాగా స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్.. సిప్రి అనేసంస్థ ప్రపంచంలో న్యూక్లియర్ వార్ హెడ్ల గణాంకాలతో ఓ నివేదిక విడుదల చేసింది. జూన్ 14న రిలీజయిన ఈ రిపోర్టు ఆధారంగా చూస్తే.. అణ్వస్త్ర వార్ హెడ్లను కలిగిన వున్న దేశాల జాబితాలో మనదేశం చైనా, పాకిస్తాన్‌ల కంటే వెనుకే వుంది. పాకిస్తాన్ 165 న్యూక్లియర్ వార్ హెడ్లను కలిగి వుండగా.. మన దేశం దగ్గర కేవలం 156 న్యూక్లియర్ వార్ హెడ్లను మాత్రమే కలిగి వుంది. ఇక చైనా 359 అణు వార్ హెడ్లతో మనకంటే చాలా ముందున్నది.

ప్రపంచంలో తొమ్మిది దేశాలు అణ్వస్త్ర సామర్థ్యం కలిగి వుండగా.. ఈ దేశాల దగ్గర మొత్తం 13 వేల 80 న్యూక్లియర్ వార్ హెడ్లున్నాయి. ఈ తొమ్మిది దేశాల జాబితాలో రష్యా తొలి స్థానంలో వుంది. రష్యా దగ్గర 6 వేల 255 వార్ హెడ్లున్నాయి. రెండో స్థానంలో వున్న అమెరికా దగ్గర 5 వేల 550 వార్ హెడ్లున్నాయని సిప్రి రిపోర్టు పేర్కొంది. ఆ తర్వాత స్థానంలో చైనా వుండగా.. 290 వార్ హెడ్లతో ఫ్రాన్స్ నాలుగో స్థానంలోను, 225 వార్ హెడ్లతో యుకే అయిదో స్థానంలోను వున్నాయి. ఆ తర్వాత పాకిస్తాన్ 165 ఆరో స్థానంలోను, 156 వార్ హెడ్లతో ఇండియా ఏడో స్థానంలోను వున్నాయి. 90 వార్ హెడ్లను కలిగి వున్న ఇజ్రాయెల్ ఎనిమిదో స్థానంలో వుండగా.. 40 నుంచి 50 అణ్వస్త్ర వార్ హెడ్లను కలిగి వున్న ఉత్తర కొరియా తొమ్మిదో స్థానంలో కొనసాగుతోందని సిప్రి రిపోర్టు తెలిపింది.

మూడో స్థానంలో వున్న చైనా తన అణ్వస్త్ర సామర్థ్యాన్ని పెంపొందించుకునేందకు ఇంకా ప్రయత్నిస్తూనే వుంది. అణ్వస్త్రాలను ఆధునీకరించుకోవడం.. వాటిని మరింతగా విస్తరించడం వంటి పనులను చైనా కొనసాగిస్తోందని సిప్రి వెల్లడించింది. ఇండియా, పాకిస్తాన్ దేశాలు సైతం న్యూక్లియర్ శక్తిని ఆధునీకరించుకునే పనిలో బిజీగా వున్నాయని సిప్రి అంఛనా వేసింది. అయితే.. పాకిస్తాన్ మన దేశం కంటే ఎక్కువ సంఖ్యలో వార్ హెడ్లను కలిగి వున్నప్పటికీ.. వాటిని ప్రయోగించే సామర్థ్యంలో మాత్రం మనకంటే వెనుకబడే వుంది. దీనికి కారణం మన దేశం దగ్గర అగ్ని 5 లాంటి ఇండిజీనియస్ మిస్సైల్ సిస్టమ్ బాగా డెవలప్ అయి వుంది. ఆసియా ఖండంలోని ఏ ప్రదేశానికైనా మిస్సైళ్ళను సంధించగల బాలిస్టిక్ మిస్సైల్ కెపాసిటీ భారత్‌కు వుందని సిప్రి నివేదిక పేర్కొంది. రాఫేల్ యుద్ద విమానాలతోపాటు ఐఎన్ఎస్ అరిహంట్ వంటి యుద్ద నౌకలు భారత సైనిక సంపత్తికి బలంగా మారాయని అంఛనా వేసింది.