Website Down: అమెజాన్, జోమాటో, పేటిఎమ్‌లతో సహా ప్రపంచవ్యాప్తంగా 29 వేల వెబ్‌సైట్లు గురువారం కొంతసమయం పాటు నిలిచిపోయాయి. ఈ కంపెనీల వెబ్‌సైట్లు పనిచేయడం మానేశాయి లేదా వాటి వేగం చాలా నెమ్మదిగా మారింది. వీటిలో అనేక విమానయాన సంస్థలు, బ్యాంకులు,టెక్ కంపెనీలు ఉన్నాయి. ఇది కాకుండా, సోనీ లివ్, హాట్ స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల అనువర్తనాలు కూడా గురువారం అకస్మాత్తుగా నెమ్మదించాయి.
డొమైన్ నేమ్ సిస్టమ్ (డిఎన్ఎస్) తో సమస్య కారణంగా ఈ వెబ్‌సైట్లు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అయితే, ఇప్పుడు ఇవి బాగానే నడుస్తున్నాయి. అంతరాయం కారణంగా ఈ కంపెనీల వెబ్‌సైట్లు లోడ్ కాలేదు. వెబ్‌సైట్లు ఓపెన్ చేయాడానికి ప్రయత్నించిన వారికి డొమైన్ నేమ్ సిస్టమ్ సేవలో లోపాన్నిచూపించింది.
క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థ అకామై టెక్నాలజీస్ (AKAM.O) మేము ఎడ్జ్ డీఎన్ఎస్ సేవతో సమస్యలను పరిశీలిస్తున్నామని చెప్పారు. దీనిని ఇంకా ధృవీకరించాల్సి ఉందని చెప్పింది.
అమెరికన్ కంపెనీలపై ప్రభావం
DNS పనిచేయకపోవడం వల్ల, అమెరికాలోని పెద్ద కంపెనీలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. వీటిలో డెల్టా ఎయిర్ లైన్స్ (DAL.N), కాస్ట్కో హోల్‌సేల్ కార్ప్ (COST.O), అమెరికన్ ఎక్స్‌ప్రెస్ (AXP.N) తో సహా అనేక విమానయాన సంస్థలు, బ్యాంకింగ్, ఐటి కంపెనీలు ఉన్నాయి.
రెండు నెలల్లో మూడవసారి ఇలా..
జూన్ నెలలో ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా, ప్రభుత్వం, వార్తా వెబ్‌సైట్‌లను ఈ సమస్య దెబ్బతీసింది. వెబ్‌సైట్లు కేవలం 2 నెలల వ్యవధిలో నిలిచిపోయిన మూడవ సంఘటన ఇది. అమెరికన్ క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీల సేవలో లోపం కారణంగా డిఎన్ఎస్ వ్యవస్థ దెబ్బతిన్నట్లు నివేదికలో చెప్పబడింది. చెప్పారు. దీని ప్రభావంతో 29 వేల కంపెనీల వెబ్‌సైట్లు నిలిచిపోయాయి.