2 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన: ఐబీఎం

| Edited By:

Jun 08, 2019 | 10:17 PM

ప్రముఖ గ్లోబల్ టెక్ కంపెనీ ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్ (ఐబీఎం) అమెరికాలోని 2 వేల మంది ఉద్యోగులపై వేటేసింది. ఐబీఎంలో మొత్తం 3,50,600 మంది ఉద్యోగులు ఉండగా, ఇప్పుడు తొలగించిన వారి సంఖ్య అందులో ఒకశాతంగా కంపెనీ పేర్కొంది. తొలగించిన ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువని, పోటీకి తగ్గట్టుగా వారి ప్రదర్శన లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. టెక్నాలజీ రంగంలో ఐబీఎం గత కొన్నేళ్లుగా వెనకబడింది. 2018లో ఐబీఎం ఆదాయంలో కేవలం ఒకశాతం మాత్రమే […]

2 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన: ఐబీఎం
Follow us on

ప్రముఖ గ్లోబల్ టెక్ కంపెనీ ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్ (ఐబీఎం) అమెరికాలోని 2 వేల మంది ఉద్యోగులపై వేటేసింది. ఐబీఎంలో మొత్తం 3,50,600 మంది ఉద్యోగులు ఉండగా, ఇప్పుడు తొలగించిన వారి సంఖ్య అందులో ఒకశాతంగా కంపెనీ పేర్కొంది. తొలగించిన ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువని, పోటీకి తగ్గట్టుగా వారి ప్రదర్శన లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. టెక్నాలజీ రంగంలో ఐబీఎం గత కొన్నేళ్లుగా వెనకబడింది. 2018లో ఐబీఎం ఆదాయంలో కేవలం ఒకశాతం మాత్రమే వృద్ధి నమోదైంది. బిజినెస్ రానురాను పడిపోతుండడంతో గత కొంతకాలంగా ఉద్యోగులకు లేఆఫ్ ఇస్తూ వస్తోంది. అందులో భాగంగానే తాజా మరికొందరు ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటించింది.