
మలేషియాలో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి ఆదేశంలో తనకు జరిగిన ఘోర అవమాన్ని సోషల్ మీడియా వేధికగా పంచుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేస్తూ.. అతను తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. నిరాశ్రయుడైన అతను ఒక బ్యాంక్ ముందు పడుకుంటే స్థానికంగా ఉంటున్న ఒక వ్యక్తి అతన్ని కాళ్లతో తంతూ.. కర్రతో కొట్టినట్టు ఆయన పేర్కొన్నాడు, ఇందుకు సంబంధించిన వీడియోను కూడా అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదురు స్థానిక వ్యక్తి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నివేదికల ప్రకారం: సఫీయుద్దీన్ పక్కీర్ మొహమ్మద్ అనే వ్యక్తి ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో డబ్బులు సంపాధించేందుక 2024 లో భారతదేశం నుండి మలేషియాకు వెళ్లాడు. అక్కడే ఏదో పని చేసుకుంటూ ఇండియాలోని తన ఫ్యామిలీకి డబ్బులు పంపాలని అనుకున్నాడు. దీంతో అతను 2024 మార్చిలో అయితే మలేషియాలోని తమిళనాడుకు చెందిన రెస్టారెంట్‌లో వంటవాడిగా ఉద్యోగం ప్రారంభించాడు. అయితే కొన్ని రోజుల్లోనే అతని పరిస్థితి దిగజారిపోయింది. వర్క్ పర్మిట్ కోసం RM3,500 (సుమారు రూ. 75,500), ఆరోగ్య సంరక్షణ కోసం RM1,200 ( రూ 26,000) తన యజమానికి చెల్లించినట్టు సఫీయుద్దీన్ తెలిపాడు.
అయితే అతను జీతం చేసినప్పటికీ యజమాని మాత్రం సఫీయుద్దీన్ జీతం చెల్లిండం ఆపేశాడు. కొన్ని నెలలు పాటు యజమాని అతనికి జీతం చెల్లించకపోవడంతో.. సఫీయుద్దీన్ ఇంటికి డబ్బులు పంపించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అంతే కాకుండా తన యజమాని తన పాస్‌పోర్ట్‌ను కూడా తీసుకున్నాడని అందువల్లే తిరిగి భారతదేశానికి కూడా రాలేకపోయానన్నాడు. ఉద్యోగం మానేద్దాం అనుకున్న ఓనర్ అందుకు అనుమతించలేదు.. దీంతో సఫీయుద్దీన్ గత ఆరు నెలలుగా జాబ్ వెళ్లడం మానేశాడు.
భారత్‌కు తిరిగి వెళ్దామంటే పాస్‌పోర్టు లేదు, ఉద్యోగం లేకపోవడంతో డబ్బు లేదు.. దీంతో అతనికి ఉండడానికి నివాసం కూడా లేకుండా పోయింది. ఇక చేసేదేమి లేక సఫీయుద్దీన్ వీధుల్లో నివసిస్తూ.. అక్కడే పడుకోవడం మొదలుపెట్టాడు. అయితే అతను రోజూ ఆమ్‌బ్యాంక్ తమన్ మలూరి బ్రాంచ్ ముందు వెళ్లి పడుకునేవాడు. అది గమనించిన అక్కడి సెక్యూరిటీ అతన్ని కాళ్లతో తంతూ.. కర్రతో కొట్టి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించాడు.
ఈ ఘటనపై బాధితులు ఒక స్థానిక మీడియా సంస్థలో మాట్లాడుతూ.. వారు నన్ను వెళ్లిపోవాలని చెబితే, నేను నిశ్శబ్దంగా వెళ్లి ఉండేవాడిని. కానీ నేను చాలా బలహీనంగా, ఆకలిగా, ఒత్తిడికి, నిరాశకు గురయ్యాను అని చెప్పాడు. అలాంటి స్థతిలో వాళ్లు తనతో అలా ప్రవర్తించడం తనను తీవ్రంగా బాధించిందని చెప్పుకొచ్చాడు. అయితే బాధితుడు పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడతో స్థానకంగా నిరాశ్రయులకు ఆశ్రయాలను కల్పించే టోనీ లియాన్ అనే వ్యక్తి సఫీయుద్దీన్‌కు ఆశ్రయం కల్పించాడు.
వీడియో చూడండి..
Hanya seorang tukang kasut dan pengawal keselamatan, tapi lagaknya nauzubillah… sampai sanggup simbah air dan naik kaki halau gelandangan, seolah² manusia tu takdak maruah. Dari sini jelas, perancangan Allah itu Maha Tepat. Tidak hairanlah rezeki mereka ditetapkan hanya sebagai… pic.twitter.com/mS1lq8mAqM
— 𝙸𝚗𝚌𝚎𝚔 𝚂𝚝𝚎𝚊𝚍𝚢 (@amr_zhn01) November 25, 2025
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.