Corona: చీమల్లా చనిపోతున్న జనాలు.. శ్మశానాల ముందు మృతదేహాలతో క్యూలైన్లు.. నెట్టింట హృదయవిదారక దృశ్యాలు..

|

Dec 27, 2022 | 7:33 AM

ప్రతీ రోజూ వైరస్ కారణంగా వందలాది మంది చనిపోతుండటంతో అక్కడ శ్మశానవాటికల ముందు జనాలు అంత్యక్రియల కోసం మృతదేహాలతో గంటల తరబడి క్యూలో..

Corona: చీమల్లా చనిపోతున్న జనాలు.. శ్మశానాల ముందు మృతదేహాలతో క్యూలైన్లు.. నెట్టింట హృదయవిదారక దృశ్యాలు..
China Corona
Follow us on

కోవిడ్ మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్7 వల్ల చైనా విలవిలలాడుతోంది. రోజుకు లక్షల మంది ప్రజలు ఈ వైరస్ బారిన పడుతున్నారు. అలాగే వందలాది మందికి ఈ కొత్త వేరియంట్ సోకి ప్రాణాలు కోల్పోతున్నారు. అక్కడ రోజువారీ కేసులు 10 లక్షలకు పైగా నమోదవుతున్నాయి. దీన్ని బట్టే ఆ దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చెప్పవచ్చు. ఇంతలా నమోదవుతున్నా.. ప్రపంచ దేశాలకు తెలియనీకుండా కరోనా కేసులు, మరణాల సంఖ్యను డ్రాగన్ కంట్రీ దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అయితేనేం అక్కడ పరిస్థితులకు సంబంధించి సోషల్ మీడియాలో బయటపడుతున్న వీడియోలు నెటిజన్ల హృదయాలను కలచివేస్తున్నాయి. ప్రతీ రోజూ వైరస్ కారణంగా వందలాది మంది చనిపోతుండటంతో అక్కడి శ్మశానవాటికల ముందు ప్రజలు అంత్యక్రియల కోసం మృతదేహాలతో గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూసే పరిస్థితులు తలెత్తాయి.

ఆరోగ్య నిపుణుడు ఎరిక్ ఫీగల్-డింగ్ తన ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో తమ వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు గంటల తరబడి క్యూలో నిల్చుని మృతదేహాలను తీసుకెళ్తున్న దృశ్యాలు అందరి హృదయాలను కదిలిస్తున్నాయి. “శ్మశానవాటికల వద్ద పెద్ద క్యూ లైన్లు ఉన్నాయి. మీ ప్రియమైన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు క్యూలో గంటల తరబడి వేచి ఉండటమే కాకుండా, ఆ సమయం అంతటా వారి మృతదేహాలను మోసుకెళ్లి చేయాల్సి ఉంటుందని ఊహించుకోండి. కోవిడ్‌తో విలవిలలాడుతున్న చైనాపై సానుభూతి చూపుదాం.” అని డాంగ్ వీడియోకు క్యాప్షన్‌గా తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

కాగా, డిసెంబర్ 1వ తేదీ నుంచి కరోనా కొత్త వేరియంట్ చైనాలో విజ‌ృంభిస్తోంది. రోజూ లక్షలాది మంది ప్రజలు ఈ వైరస్ బారిన పడుతున్నారు. ప్రస్తుతం కోవిడ్ ఫోర్త్ వేవ్ డ్రాగన్ కంట్రీని కుదిపేస్తోంది. చైనా నేషనల్ హెల్త్ కమీషన్ నుంచి లీకైన ఓ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా దాదాపు 248 మిలియన్ల మంది, అంటే ఆ దేశంలో మొత్తం జనాభాలోని దాదాపు 17.56 శాతం మందికి, డిసెంబర్ 1-20 మధ్య కోవిడ్ సోకినట్లు సమాచారం.