హమాస్ గాజా చీఫ్‌ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్.. మూడు నెలల తర్వాత ప్రకటన

|

Oct 03, 2024 | 5:36 PM

ఐడీఎఫ్( ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్) సంచలన విషయాన్ని వెల్లడించింది. గత మూడు క్రితం గాజాలో నిర్వహించిన వైమానిక దాడిలో హమస్ చీఫ్‌ మృతిచెందినట్లు తెలిపింది. హమస్ చీఫ్‌‌ను తమే చంపినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా ఐడీఎఫ్ ఒప్పుకోవడం సంచలనంగా మారింది.

హమాస్ గాజా చీఫ్‌ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్.. మూడు నెలల తర్వాత ప్రకటన
Rawhi Mushtaha Died
Follow us on

హమాస్ గాజా చీఫ్‌ను మట్టుబెట్టిన మూడు నెలల తర్వాత ప్రకటన ఐడీఎఫ్( ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్) సంచలన విషయాన్ని వెల్లడించింది. గత మూడు క్రితం గాజాలో నిర్వహించిన వైమానిక దాడిలో హమస్ చీఫ్‌ మృతిచెందినట్లు తెలిపింది. హమస్ చీఫ్‌‌ను తామే చంపినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా ఐడీఎఫ్ ఒప్పుకోవడం సంచలనంగా మారింది. నార్త్ గాజాలోని అండర్ గ్రౌండ్ గాజా‌పై దాడి జరిగినట్లు చెప్పారు. ఈ దాడిలో ఇద్దరు హమాస్ కమాండర్లు సమేహ్ సిరాజ్, సమేహ్ ఔదేహ్‌తో పాటు గాజా ప్రధాని రౌహీ ముష్తాహా‌ను హతమారినట్లు పేర్కొన్నారు.

ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ట్వీట్ చేసి తెలిపింది. హమాస్ దాడులను బయటకు చెప్పట్లేదని, అధికారుల మరణాలకు బయటకు వెళ్లకుండా దాస్తుందని పేర్కొన్నారు. హమాస్ ఇలా చేయడానికి కారణమేంటో కూడా ఐడీఎఫ్ వెల్లడించింది. ఒకవేళ సీనియర్ అధికారుల మరణాలు బయటికి చెబితే వారి తీవ్రవాద దళాలు ఆత్మవిశ్వాసం కోల్పోపోతారని హమాస్ ఇలా మరణాలను దాచిపేడుతుందని చెప్పారు.

నిజానికి హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌కు రావీ ముష్తాహా ఆప్తుడు అని చెప్పాలి.ఈ ఇద్దరు ఇజ్రాయెల్ జైల్లో చాలా ఏండ్లు కలిసి ఉన్నారు. గాజాలో యుద్దం జరుగుతున్నప్పుడు రావీ ముష్తాహా ప్రజలకు అండగా నిలిచారు. ఇప్పుడు తాజాగా రావీ ముష్తాహా మృతి చెందినట్లు ఐడీఎఫ్ ప్రకటించడం సంచలనంగా మారింది. యాహ్యా సిన్వార్‌ కూడా మూడు నెలల నుంచి ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియకపోవడం గమనార్హం..

 

ఎక్స్‌లో ఐడీఎఫ్( ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్) చేసిన ట్వీట్:

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి