ఇమ్రాన్‌పై కసి: గూగుల్‌లో ‘బికారి’..!

ప్రస్తుతం గూగుల్‌లో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫొటో ఒకటి బాగా వైరల్ అవుతోంది. బికారి గెటప్‌లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఫొటో చూసి అందరూ షాక్ అవుతున్నారు. గూగుల్లో ‘బికారి(Bhikari)’ అని ఇంగ్లీషులో టైప్ చేస్తే ఇమ్రాన్ ఖాన్ ఫొటో ఒకటి ప్రత్యక్షమవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఈ ఫొటోను బాగా ట్రోల్ చేస్తున్నారు. అయితే.. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు.. ఇది ఎవరో కావాలనే చేసి వుంటారని కొందరు.. లేదు బాగానే అయ్యిందంటూ ఇమ్రాన్ […]

ఇమ్రాన్‌పై కసి: గూగుల్‌లో బికారి..!

Edited By:

Updated on: Aug 18, 2019 | 6:42 PM

ప్రస్తుతం గూగుల్‌లో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫొటో ఒకటి బాగా వైరల్ అవుతోంది. బికారి గెటప్‌లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఫొటో చూసి అందరూ షాక్ అవుతున్నారు. గూగుల్లో ‘బికారి(Bhikari)’ అని ఇంగ్లీషులో టైప్ చేస్తే ఇమ్రాన్ ఖాన్ ఫొటో ఒకటి ప్రత్యక్షమవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఈ ఫొటోను బాగా ట్రోల్ చేస్తున్నారు. అయితే.. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు.. ఇది ఎవరో కావాలనే చేసి వుంటారని కొందరు.. లేదు బాగానే అయ్యిందంటూ ఇమ్రాన్ మీద తమ కసిని తీర్చుకుంటున్నారు.

కాగా.. ఇదివరకే.. టాయిలెట్ పేపర్ అని గూగుల్‌లో టైప్‌ చేస్తే.. పాకిస్తాన్ జాతీయ జెండా వచ్చింది. దీనిపై పాకిస్తానీలు ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. అప్పడు కూడా ఈ వార్త ఫుల్‌గా వైరల్‌ అయ్యింది. ఇదే.. వైనం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విషయంలో కూడా ఎదురయ్యింది. ‘ఇడియట్’ అని గూగుల్‌లో టైప్ చేస్తే ట్రంప్ ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి. దీనిపై గూగుల్‌ సీఈవో సుందర్ పిచాయ్‌కు ట్రంప్ ఫిర్యాదు కూడా చేశారు. కాగా.. వింగ్ కమాండర్ అభినందన్‌ వర్థమాన్ విషయంలో.. భారత్‌తో గొడవలు వద్దు.. సంయమనం పాటించాలని కోరిన పాక్ ప్రధాని ఇమ్రాన్ విషయంలో ఇలా జరగడం ఒక విధంగా.. బాధాకరమే అన్న అభిప్రాయాలు కూడా వినవస్తున్నాయి.

పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతున్న నేపథ్యంలో.. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఫొటోను ఈ విధంగా మార్ఫింగ్ చేసి సర్క్యులేట్ చేస్తున్నట్లు కూడా కనబడుతుంది. తమ దేశాన్ని ఆర్థికంగా ఆదుకోవాలంటూ.. ఇమ్రాన్ ఇటీవలే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను అభ్యర్థించిన విషయం తెలిసిందే.

ఇక్కడ సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ చూడండి: