18 ఏళ్ల భారత సాహస కిశోరం.. దక్షిణ ధృవం చేరుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డ్!

యావత్ దేశం మురిసిపోయేలా 18 ఏళ్ల సాహస కిశోరం కామ్య కార్తికేయన్ అరుదైన చరిత్ర సృష్టించింది. గడ్డకట్టే చలిని, మంచు గాలులను ఎదిరించి దక్షిణ ధృవం చేరుకున్న అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయురాలిగా ఆమె రికార్డు నెలకొల్పింది. మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ గడ్డకట్టే చలిని, భీకరంగా వీచే మంచు గాలులను తట్టుకుంటూ కామ్య తన యాత్రను కొనసాగించింది.

18 ఏళ్ల భారత సాహస కిశోరం.. దక్షిణ ధృవం చేరుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డ్!
Kamya Karthikeyan Skis To South Pole

Updated on: Dec 31, 2025 | 8:57 AM

యావత్ దేశం మురిసిపోయేలా 18 ఏళ్ల సాహస కిశోరం కామ్య కార్తికేయన్ అరుదైన చరిత్ర సృష్టించింది. గడ్డకట్టే చలిని, మంచు గాలులను ఎదిరించి దక్షిణ ధృవం చేరుకున్న అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయురాలిగా ఆమె రికార్డు నెలకొల్పింది. మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ గడ్డకట్టే చలిని, భీకరంగా వీచే మంచు గాలులను తట్టుకుంటూ కామ్య తన యాత్రను కొనసాగించింది. 115 కిలోమీటర్ల దూరాన్ని కాలినడకన అధిగమించింది. తన యాత్రకు అవసరమైన పూర్తి సామగ్రిని స్వయంగా మోసుకెళ్తూ ఈ 27న దక్షిణ ధృవాన్ని ముద్దాడింది.

ఇంతకుముందే ఆమె ప్రపంచంలోని ఏడు ఎత్తైన శిఖరాలను అధిరోహించారు. అందులో ప్రపంచంలోనే ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ కూడా ఉంది. ఒక నౌకాదళ అధికారి కుమార్తెగా, నేవీ చిల్డ్రన్ స్కూల్ పూర్వ విద్యార్థిగా కామ్య సాధించిన ఈ విజయాన్ని ఇండియన్ నేవీ అభినందించింది. తన తదుపరి లక్ష్యం ‘ఉత్తర ధృవం’ జయించాలని, అక్కడ కూడా భారత్ జెండా ఎగురవేయాలని ఆకాంక్షించింది.

భారత నావికాదళ అధికారి, పర్వతారోహణ ప్రతిభ కలిగిన 18 ఏళ్ల కుమార్తె కామ్య కార్తికేయన్, గడ్డకట్టే చలి, ఈదురుగాలులను తట్టుకుని దక్షిణ ధ్రువానికి స్కీయింగ్ చేయడం ద్వారా చరిత్ర సృష్టించింది. కామ్య కార్తికేయన్ స్లెడ్జ్-పుల్ తో 89 డిగ్రీల దక్షిణం నుండి దాదాపు 115 కిలోమీటర్ల దూరం ప్రయాణించి డిసెంబర్ 27, 2025న దక్షిణ ధ్రువానికి చేరుకుంది. ఈ ఘనత ఆమెను దక్షిణ ధ్రువానికి స్కీయింగ్ చేసిన అతి పిన్న వయస్కురాలైన భారతీయురాలిగా, ప్రపంచంలోనే రెండవ అతి పిన్న వయస్కురాలిగా చేసింది. ఈ ఘనతలో ఏడు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించడం, రెండు ధ్రువాలకు స్కీయింగ్ చేయడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఈ మేరకు భారత నావికాదళం కామ్య కార్తికేయన్‌ను ఒక పోస్ట్‌లో అభినందించింది.

ఆమె స్లెడ్జ్ లాగుతున్న వీడియో క్లిప్, కొన్ని ఛాయాచిత్రాలను కూడా నేవీ షేర్ చేసింది. “నావల్ ఆఫీసర్ కుమార్తె, నేవీ చిల్డ్రన్ స్కూల్ (NCS) పూర్వ విద్యార్థిని అయిన 18 ఏళ్ల కామ్య కార్తికేయన్ (@KaamyaSahas) ను భారత నేవీ అభినందిస్తోంది, ఆమె మరోసారి దక్షిణ ధ్రువానికి స్కీయింగ్ చేసిన అతి పిన్న వయస్కురాలైన భారతీయురాలు, ప్రపంచంలో రెండవ అతి పిన్న వయస్కురాలైన మహిళగా చరిత్ర సృష్టించింది” అని పోస్ట్‌లో పేర్కొన్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..