China virus coming: నేను ముందే చెప్పానా.. ఇది కుంగ్‌ ఫూ వైరస్‌.. మరోసారి దాడి మొదలు పెట్టిన ట్రంప్

|

Jun 04, 2021 | 1:23 PM

China virus: ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న వైరస్ జాడ చైనాలోనే ఉందని.. యావత్‌ ప్రపంచానికి చైనా భారీ మూల్యం చెల్లించాలని మరోసారి కామెంట్ చేశారు.

China virus coming: నేను ముందే చెప్పానా.. ఇది కుంగ్‌ ఫూ వైరస్‌.. మరోసారి దాడి మొదలు పెట్టిన ట్రంప్
China Virus
Follow us on

డ్రాగన్ కంట్రీ చైనాపై తనదైన తరహాలో మరోసారి విరుచుకుపడ్డారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చైనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌ నుంచే వచ్చిందని తాను ముందే చెప్పానని అన్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ పుట్టుక గురించి తాను చెప్పిందే నిజమైందంటున్నారు అన్నారు. చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌లోనే ఈ వైరస్‌ను సృష్టించారంటూ ఇటీవల పలు అధ్యయనాలు పేర్కొంటున్న విషయం తెలిసిందే.

ఈ పరిశోధనలపై స్పందించిన ట్రంప్‌.. తాజాగా ఈ ప్రకటన విడుదల చేశారు. ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న వైరస్ జాడ చైనాలోనే ఉందని.. యావత్‌ ప్రపంచానికి చైనా భారీ మూల్యం చెల్లించాలని మండిపడ్డారు.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టి ఏడాది గడిచినా ఇంకా దాని జన్మస్థలంపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేదు. ఈ వైరస్‌ను చైనానే సృష్టించిందని, ఇది కుంగ్‌ ఫూ వైరస్‌ అని ట్రంప్‌ గతేడాదే ప్రకటించారు. అయితే ఆయన ఆరోపణలకు ఆధారాలు లేవని శాస్త్రవేత్తలతో పాటు అమెరికా గూఢఛారి సంస్థలూ వాదించాయి.

ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికలల్లో ట్రంప్‌ ఓడిపోయిన తర్వాత ఈ విషయం తాత్కాలికంగా మరుగున పడినా.. ఇటీవల మళ్లీ చైనా కుట్రకోణం తెరపైకి వచ్చింది. ఈ వైరస్‌ చైనా సృష్టే అని, జీవాయుధంగా మార్చేందుకు డ్రాగన్‌ చేసిన పరిశోధనల ఫలితమే ఈ కోవిడ్ విలయమని ఇటీవల బ్రిటన్‌ సహా పలు దేశాలు చేసిన పరిశోధనల్లో తేలింది.

ఇవి కూడా చదవండి: Andhra Pradesh: రెండు వారాల్లో 24 వేల మంది చిన్నారులకు పాజిటివ్… ముంచుకొస్తున్న థర్డ్ వేవ్‌కు ఇది సంకేతమా..!

NASA New Mission Venus: శుక్రుడి అంతు తేలుస్తాం..! వీనస్‌పై ఫోకస్ పెట్టిన నాసా..!

Milkha Singh: మళ్లీ ఆసుపత్రిలో చేరిన భారత అథ్లెట్ దిగ్గజం.. ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో ICUలో మిల్కా సింగ్..

కరోనా సెకెండ్ వేవ్‌లో ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో మార్పుల లేదని ప్రకటన