సరిహద్దులో కొత్త ఉద్రిక్తత.. భారత్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ జమాతే ఇస్లామ్ వీధి పోరు!

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు అంశం మరోసారి ఉద్రిక్తతలకు దారితీస్తోంది. భారతదేశం బలవంతంగా బంగ్లాదేశ్ పౌరులను సరిహద్దు దాటించి తమ దేశంలోకి పంపిస్తోందని ఆరోపిస్తూ, బంగ్లాదేశ్ జమాతే-ఈ-ఇస్లామ్ నేతృత్వంలోని 11 పార్టీల కూటమి సరిహద్దు ప్రాంతాల్లో భారీ నిరసనలకు పిలుపునిచ్చింది. శుక్రవారం (జూన్ 12) సరిహద్దు జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించనున్న ఈ కూటమి, జూన్ 15న రాజధాని ఢాకాలో భారీ నిరసన సభ, ఊరేగింపు చేపట్టనున్నట్లు ప్రకటించింది.

సరిహద్దులో కొత్త ఉద్రిక్తత.. భారత్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్  జమాతే ఇస్లామ్ వీధి పోరు!
Bangadesh Islamist Jamaat

Updated on: Jun 12, 2026 | 9:02 AM

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు అంశం మరోసారి ఉద్రిక్తతలకు దారితీస్తోంది. భారతదేశం బలవంతంగా బంగ్లాదేశ్ పౌరులను సరిహద్దు దాటించి తమ దేశంలోకి పంపిస్తోందని ఆరోపిస్తూ, బంగ్లాదేశ్ జమాతే-ఈ-ఇస్లామ్ నేతృత్వంలోని 11 పార్టీల కూటమి సరిహద్దు ప్రాంతాల్లో భారీ నిరసనలకు పిలుపునిచ్చింది. శుక్రవారం (జూన్ 12) సరిహద్దు జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించనున్న ఈ కూటమి, జూన్ 15న రాజధాని ఢాకాలో భారీ నిరసన సభ, ఊరేగింపు చేపట్టనున్నట్లు ప్రకటించింది.

జమాత్ నేతలు భారత్ అక్రమంగా బంగ్లాదేశ్ పౌరులను తిరిగి పంపిస్తోందని, అలాగే బీఎస్ఎఫ్ కాల్పుల్లో బంగ్లాదేశ్ పౌరులు మరణిస్తున్నారని ఆరోపించారు. గత మూడు నెలల్లో సరిహద్దు వెంబడి 50కిపైగా “పుష్-ఇన్” ఘటనలు జరిగాయని, సుమారు 2,479 మందిని బంగ్లాదేశ్‌లోకి పంపేందుకు ప్రయత్నించారని జమాత్ నాయకుడు ఏహెచ్‌ఎం హమీదుర్ రెహమాన్ ఆజాద్ పేర్కొన్నారు. ఇదే సమయంలో హసీనా వ్యతిరేక ఉద్యమం నుంచి ఎదిగిన ఎన్‌సీపీ కూడా ఈ నిరసనలకు మద్దతు ప్రకటించింది. సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలు మానవ కవచంగా ఏర్పడి అక్రమ ప్రవేశాలు, బలవంతపు తరలింపులను అడ్డుకోవాలని ఎన్‌సీపీ నేతలు పిలుపునిచ్చారు.

అయితే ఈ ఆరోపణలను భారత్ పూర్తిగా ఖండిస్తోంది. అక్రమంగా భారత్‌లో నివసిస్తున్న విదేశీ పౌరులను మాత్రమే చట్టబద్ధమైన విధానాలు, ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం స్వదేశానికి పంపుతున్నామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. సరైన గుర్తింపు, ధృవీకరణ అనంతరమే చర్యలు చేపడుతున్నామని తెలిపింది.

ఇటీవల న్యూఢిల్లీలో బీజీబీ, బీఎస్ఎఫ్‌ల మధ్య జరిగిన డైరెక్టర్ జనరల్ స్థాయి సమావేశాల్లో కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. సుమారు 4,096 కిలోమీటర్ల పొడవైన భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు నేపథ్యంలో ఈ వివాదం ఇరు దేశాల మధ్య కీలక అంశంగా మారింది. దౌత్యస్థాయిలో చర్చలు కొనసాగుతున్నప్పటికీ, జమాత్ నేతృత్వంలోని కూటమి వీధి పోరాటానికి సిద్ధమవుతుండటంతో ఈ అంశం మరింత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us