HIV/AIDS: ఎయిడ్స్ రోగులకు శుభవార్త.. ఇక దిగులుపడాల్సిన అవసరం లేదు..

|

Dec 30, 2024 | 8:36 PM

యావత్తు ప్రపంచం ఎప్పుడెప్పుడా అని వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్న ఎయిడ్స్ టీకా ఎట్టకేలకు వచ్చేసిందోచ్.. గిలీడ్ సైన్సెస్ ఈ టీకా రుపొందించిగా, దాని తాజాగా USFDA Lenacapavir ఇంజక్షన్‌కు అనుమతించింది. దీన్ని మూడు సంవత్సరాల్లో 20 లక్షల మందికి అందిజేయనున్నట్లు తెలుస్తుంది. దక్షణాఫ్రియా, టాంజానియాలో ఎక్కువ ఎయిడ్స్ కేసులు ఉన్న నేపథ్యంలో అక్కడ ట్రయల్స్లో నిర్వహించారు.

HIV/AIDS: ఎయిడ్స్ రోగులకు శుభవార్త.. ఇక దిగులుపడాల్సిన అవసరం లేదు..
Hiv
Follow us on

యావత్తు ప్రపంచం ఎప్పుడెప్పుడా అని వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్న ఎయిడ్స్ టీకా ఎట్టకేలకు వచ్చేసిందోచ్.. గిలీడ్ సైన్సెస్ ఈ టీకా రుపొందించిగా, దాని తాజాగా USFDA Lenacapavir ఇంజక్షన్‌కు అనుమతించింది. దీన్ని మూడు సంవత్సరాల్లో 20 లక్షల మందికి అందిజేయనున్నట్లు తెలుస్తుంది. దక్షణాఫ్రియా, టాంజానియాలో ఎక్కువ ఎయిడ్స్ కేసులు ఉన్న నేపథ్యంలో అక్కడ ట్రయల్స్లో నిర్వహించారు. ఈ ట్రయల్స్లో విజయవంతం అయినట్లు తెలుస్తుంది. ఈ ఇంజక్షన్‌ను ఏడాదికి రెండు సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఇంజక్షన్ కామన్ పిపుల్‌కి కూడా అందుబాటులో ఉంటుందా లేదా అనేది చూడాలి..

1980ల్లో HIV/AIDS ని వైద్య శాస్త్రవేత్తలు కన్నుగొన్నారు. అయితే అప్పటి నుంచి ఇప్పుటి వరకు దానికి వ్యాక్సన్ లేకపోవడం HIV/AIDS పేషేంట్స్‌ను ఆందోళన కలిగించే విషయం. HIV/AIDS ప్రపంచవ్యాప్తంగా 42 మిలియన్లకు పైగా ప్రాణాలను బలిగొంది. 88 మిలియన్ల మందికి పైగా HIV/AIDS సోకింది.    2023 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 39.9 మిలియన్ల మంది ఎయిడ్స్‌తో జీవిస్తున్నారు. యాంటీరెట్రోవైరల్ థెరపీ (ART) HIVని స్థాయిని కొంచెం తగ్గించినా కానీ.. అది అందరికి పని చేయలేదు. 1983 వరకు ఫ్రెంచ్ పరిశోధకులు ఈ వైరస్‌ను ఎయిడ్స్ (అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ సిండ్రోమ్)గా పేరు పెట్టారు.

1987లో AZTకి FDA ఆమోదంతో తొలిసారిగా ప్రవేశపెట్టబడిన యాంటీరెట్రోవైరల్ థెరపీ, HIV చికిత్సలో ఒక మలుపు అని చెప్పవచ్చు. 50కి పైగా యాంటీరెట్రోవైరల్ మందులు ఇప్పుడు FDA అమోదించింది. అయితే ఇవి ఏవీ పూర్తిగా HIV ని నయం చేయలేకపోతున్నాయి. ప్రపంచ జనాభాలో 15 శాతం ఉన్న సబ్-సహారా ఆఫ్రికాలో హెచ్‌ఐవితో జీవిస్తున్న వారిలో మూడింట రెండు వంతుల మంది ఉన్నారు. ప్రతి వారం దాదాపు 4,000 మంది టీనేజ్ బాలికలు, యువతులు కొత్తగా HIV బారిన పడుతున్నారు (2022 గణాంకాలు).

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి