టెక్నికల్ సమస్య అగ్రరాజ్యాన్ని వణికించింది. గంటల తరబడి విమానాలను ఎగరకుండా చేసింది. ఇంతకీ, అమెరికాలో ఏం జరిగింది? సిస్టమ్స్‌ను ఎవరైనా హ్యాక్ చేశారా? వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలో విమానాలు గ్రౌండ్ అయ్యాయి. ఇందులో ఆశ్యర్యమేముంది ఎగిరిన ప్రతీ ఫ్లైట్ గ్రౌండ్ అవ్వాల్సిందే అనుకోవచ్చుగాని.. దిగిన అన్ని ఫ్లైట్లు ఎగరలేదు. దీనికి కారణం ఉంది. కంప్యూటర్లు డౌన్ అయ్యాయి. సిస్టమ్ ఫెయిల్ అయింది. దీంతో వేలాది ఫ్లైట్లు ఆగిపోయాయి. సిస్టమ్ టు ఎయిర్ మిషన్స్ ఆగిపోవడంతో ఏ ఫ్లైట్ ఎప్పుడు, ఎక్కడి నుంచి బయల్దేరాలో అనేది తెలియకుండా పోయింది. దీంతో 5,400 ఫ్లైట్లు ఆగిపోతే.. 550 ఫ్లైట్లు పూర్తిగా రద్దయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ పరిస్థితిని చక్కదిద్దేపనిలో పడింది.
అమెరికా వ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల్లో కొన్ని గంటల పాటు ఈ గందరగోళం నెలకొంది. వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్స్‌లోనే నిలిచిపోయారు. తమ ప్లైట్ ఎక్కడుందో.. ఎప్పుడు బయల్దేరుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో అంతా గందరగోళానికి గురయ్యారు. ట్విట్టర్లో ఫెడరల్ ఏవియేషన్‌ని దారుణంగా తిట్టారు ప్రయాణికులు. పరిస్థితి ఎప్పుడు అదుపులోకి వస్తుందంటూ మండిపడ్డారు. అటు FAA కూడా తీవ్రంగా కృషిచేసి.. సిస్టమ్‌ను రిస్టోర్ చేసింది. అయితే ఒకే సారి కాకుండా ఫ్లైట్స్ ఒక్కోటిగా అనుమతులు ఇస్తూ వెళ్లారు.
దాదాపు 12 గంటల పాటు అమెరికా ఎయిర్‌పోర్టుల్లో ఈ గందరగోళం నెలకొంది. FAA నోటీస్ టు యిర్ మిషన్స్ సిస్టమ్‌పై సైబర్ అటాక్ జరిగిందన్న పుకార్లు కూడా మొదలవడంతో.. వాటిని ఖండించింది సంస్థ. కేవలం సిస్టమ్ ఫెయిల్యూర్ వల్లే ఇలా జరిగిందని వివరణ ఇచ్చింది. దీనిపై సమగ్ర విచారణ జరగాలని ఆదేశించారు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్. అగ్రరాజ్యంగా పేరున్న అమెరికాలో ఇలాంటి సమస్య రావడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. దీనిపై లోతుగా విచారణ చేస్తున్నట్టు ప్రకటించారు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు. అమెరికాలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఇప్పటికే చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. తాజాగా సాంకేతిక లోపాలతో విమాన సర్వీసులను గంటలపాటు ఆపేయడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తంచేశారు. అమెరికాలో రాత్రంతా ఈ సమస్య నెలకొంది. అయితే ఉదయం 9 గంటల నుంచి క్రమంగా రాకపోకలు మొదలయ్యాయి. ఈ రోజంతా 21వేల ఫ్లైట్లు అమెరికా వ్యాప్తంగా తిరగాల్సి ఉంది. అన్నింటినీ షెడ్యూల్ చేశామంటోంది FAA.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..