North Korea’s Missile test: ఉత్తర కొరియా అధినేత కిమ్ స్టయిలే వేరు. ఓవైపు దేశం ఆర్ధికసంక్షోభంతో అల్లాడుతుంటే కొత్త క్షిపణి పరీక్ష చేసి అమెరికాతో పాటు జపాన్,దక్షిణకొరియా దేశాలకు సవాల్ విసిరాడు. ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ అమెరికాకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. అమెరికాతో పాటు మిత్రపక్షాలను సవాల్ చేస్తూ ఉత్తరకొరియా మరో క్షిపణి పరీక్ష చేసింది. 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించే ఈ మిస్సైల్ పరీక్ష విజయవంతం అయ్యిందని నార్త్ కొరియా ప్రకటించింది. అయితే ఈ క్షిపణి పరీక్షపై అమెరికాతో పాటు జపాన్ , దక్షిణ కొరియా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ప్రపంచమంతా కోవిడ్ సంక్షోభంతో అల్లాడుతుంటే కిమ్ మాత్రం కొత్త కొత్త ఆయుధాల సేకరణ పైన దృష్టి పెట్టడం కవ్వింపు చర్యల కిందే వస్తుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని బైడెన్ తెలిపారు. మిలటరీ డ్రిల్ తరువాత ఉత్తర కొరియా ఈ క్షిపణి పరీక్ష చేసింది. ఉత్తర కొరియా సైనిక విన్యాసాలకు హాజరైన కిమ్ మిస్సైల్ టెస్ట్‌కు మాత్రం హాజరుకాలేదు. జపాన్ వరకు ఈ క్షిపణి దూసుకెళ్తుంది. అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లే సామర్ధ్యం ఈ క్షిపణికి ఉందని రక్షణరంగ నిపుణులు అంటున్నారు.
నార్త్ కొరియా తయారు చేసిన తాజా క్షిపణి దాదాపు బాలిస్టిక్ క్షిపణి అంత ముప్పును సృష్టిస్తుంది. దీనికి అణువార్ హెడ్ అమరిస్తే ప్రమాదం మరింత తీవ్రమవుతుంది. క్షిపణుల గమనాన్ని గుర్తించే రాడార్లను తప్పించుకొని ఇది ప్రయాణించగలదు. ఉత్తరకొరియాతో చర్చల విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న విషయంపై జపాన్,దక్షిణ కొరియా చర్చలు జరుపుతున్నాయి. ఇదే సమయంలో మిస్సైల్ టెస్ట్‌ను చేసి కిమ్ రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శించినట్టు విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి ఉత్తరకొరియా ఆర్ధికవ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది. అయినప్పటికి కిమ్ అమెరికాతో పాటు మిత్రదేశాలతో మైండ్‌గేమ్ ఆడుతున్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి. అందుకే తాజాగా ఈ క్షిపణి పరీక్షను నిర్వహించినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కిమ్ రెచ్చిపోవడానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ నిర్లిప్త ధోరణి కూడా కారణమని అటు జపాన్ , ఇటు దక్షిణ కొరియా లోలోన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.+
Zodiac Signs: ఈ రాశుల వ్యక్తులు బలమైన వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకుంటారు.. అందులో మీరున్నారా?