ధృవాల వాతావరణ మార్పుకు, తాగుబోతుకు పోలిక

| Edited By: Ravi Kiran

Mar 18, 2019 | 2:32 PM

ధృవాల వాతావరణం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఈ ప్రాంతం స్టాటోస్పియర్‌ లేయర్‌లో ఉంటుంది. ఇక్కడ ఎక్కువ చలి ఉండి జీవించడానికి కష్టతరం అవుతుంది. ఇక్కడ శరీరాలు సైతం గడ్డ కట్టేసేంత చలి ఉంటుంది. ఈ ప్రాంతాల్లో వీచే చలిగాలులకు మనుషులు బిగుసుకుపోతారు. అయితే ఇలాంటి విచిత్రకర వాతావరణ పరిస్థితికి కారణాలపై ఎప్పటికప్పుడు పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా తేలిన విషయమేమంటే ధృవ ప్రాంతాల వాతావరణ మార్పుకు, మద్యం సేవించిన వ్యక్తికి పోలిక ఉందని చెబుతున్నారు. మద్యం సేవించిన […]

ధృవాల వాతావరణ మార్పుకు, తాగుబోతుకు పోలిక
Follow us on

ధృవాల వాతావరణం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఈ ప్రాంతం స్టాటోస్పియర్‌ లేయర్‌లో ఉంటుంది. ఇక్కడ ఎక్కువ చలి ఉండి జీవించడానికి కష్టతరం అవుతుంది. ఇక్కడ శరీరాలు సైతం గడ్డ కట్టేసేంత చలి ఉంటుంది. ఈ ప్రాంతాల్లో వీచే చలిగాలులకు మనుషులు బిగుసుకుపోతారు. అయితే ఇలాంటి విచిత్రకర వాతావరణ పరిస్థితికి కారణాలపై ఎప్పటికప్పుడు పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా తేలిన విషయమేమంటే ధృవ ప్రాంతాల వాతావరణ మార్పుకు, మద్యం సేవించిన వ్యక్తికి పోలిక ఉందని చెబుతున్నారు.

మద్యం సేవించిన వ్యక్తికి ఎలా అయితే కళ్లు తిరిగినట్టు అవ్వడం, బాడీలో వేడి పెరుగడం వంటి శరీర మార్పులు సంభవిస్తాయో.. అదే విధంగా ధృవ ప్రాంతాల వాతావరణం కూడా మార్పులకు గురవుతుందట. చలిగాలులు ఒక ధృవం నుంచి మరో ధృవం వైపుకు వీస్తుూ తీవ్ర ఇబ్బంది పెడుతుంటాయి. అమెరికాలో ఈ ప్రభావం ఎక్కువగా గమనించవచ్చు. గ్లోబర్ వార్మింగ్ ఇందుకు కారణమని, లేదు ఇది సహజంగా ప్రకృతిలో సంభవించే వాతావరణ మార్పు మాత్రమే అనే వాదనలు వినిపిస్తుంటాయి.