Electricity from Plastic: ప్లాస్టిక్ వ్యర్ధాలతో కరెంట్.. పురుగుమందులు వాడని కూరగాయలతో వంటలు.. ఆ హోటల్ ప్రత్యేకత!

ప్రస్తుతం ప్లాస్టిక్ వ్యర్ధాలను రీ సైక్లింగ్ చేయడం ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్య. ఎప్పటికప్పుడు ఈ సమస్య పరిష్కారం కోసం ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.

Electricity from Plastic: ప్లాస్టిక్ వ్యర్ధాలతో కరెంట్.. పురుగుమందులు వాడని కూరగాయలతో వంటలు.. ఆ హోటల్ ప్రత్యేకత!
Electricity From Plastic

Updated on: Aug 09, 2021 | 8:17 PM

Electricity from Plastic: ప్రస్తుతం ప్లాస్టిక్ వ్యర్ధాలను రీ సైక్లింగ్ చేయడం ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్య. ఎప్పటికప్పుడు ఈ సమస్య పరిష్కారం కోసం ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అక్కడక్కడా కొన్ని ప్రయ్నతాలు విజయవంతమూ అవుతున్నాయి. అటువంటి ఒక మంచి ప్రయత్నం జపాన్ లో విజయవంతం అయింది. అక్కడ ఒక హోటల్ పూర్తిగా ప్లాస్టిక్ వ్యర్ధ పదార్ధాలను ఉపయోగించి విద్యుత్ తయారుచేసుకుంటోంది. ప్లాస్టిక్ వ్యర్ధాలతో పాటు ఆహార వ్యర్ధాలనూ ఇందుకోసం ఉపయోగించుకుంటోంది.

జపాన్ రాజధాని టోక్యోలో ఒక హోటల్ ప్రారంభించారు. ఇది పూర్తిగా వ్యర్థాలతో తయారైన హైడ్రోజన్‌ను శక్తిగా ఉపయోగిస్తోంది. ‘కవాసకి కింగ్ స్కైఫ్రంట్ టోక్యు రే’ హోటల్‌లో, 30 శాతం హైడ్రోజన్ శక్తి ప్లాస్టిక్ వ్యర్థాల నుండి ఉత్పత్తి అవుతుంది. మిగిలిన 70 శాతం ఆహార వ్యర్థాల నుండి ఉత్పత్తి అవుతుంది. వ్యర్థాల నుండి హైడ్రోజన్ శక్తిని తయారు చేసే టెక్నాలజీని జపాన్ కంపెనీ తోషిబా కనుగొంది. హైడ్రోజన్ ఇంధన కణ వ్యవస్థలు కర్బన ఉద్గారాలు లేకుండా హైడ్రోజన్‌ను విద్యుత్తుగా మారుస్తాయి. హోటల్ అంతటా పైపుల ద్వారా శక్తిని అందించడానికి ఈ వ్యవస్థ పనిచేస్తుంది. నిర్ణీత మొత్తంలో హైడ్రోజన్ నిరంతరం అందుబాటులో ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ కార్బన్ రహితం. సందర్శకులు ఉపయోగించే టూత్ బ్రష్‌లు, దువ్వెనలు కూడా హైడ్రోజన్ తయారీకి ఉపయోగిస్తారు.

నేల లేని మొక్కలు

హైడ్రోపోనిక్స్ (మట్టి లేకుండా మొక్కలను పెంచే ప్రక్రియ),  LED కిరణజన్య సంయోగక్రియ ద్వారా హోటల్ లోపల మొక్కలను పెంచుతోంది. ఉదాహరణకు, హోటల్ లాబీలో పెరిగిన పురుగుమందు లేని పాలకూర నెలకు ఒకసారి పండిస్తారు. ఇలా హోటల్ అవసరాలకు కావలసిన కూరగాయల్లో చాలావరకూ ఇక్కడే పండిస్తుండటం విశేషం. ఈ హోటల్ లో పూర్తిగా పురుగుమందులు వాడని కూరగాయలు ఉపయోగిస్తారు.

4.50 లక్షల కిలోవాట్ల విద్యుత్

హోటల్ సంవత్సరానికి 3 లక్షల క్యూబిక్ నానోమీటర్ల హైడ్రోజన్‌ను సరఫరా చేస్తుంది, ఇది నాలుగు లక్షల 50 వేల కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఈ విద్యుత్ సంవత్సరానికి 82 గృహాల ఇంధన అవసరాలను తీర్చగలదు. హోటల్ అవసరాలకు సరిపోయిన తరువాత మిగిలిన విద్యుత్ అక్కడి ఇళ్లకు అందిస్తున్నారు.

ప్లాస్టిక్ వ్యర్ధాలతో ఇలా విద్యుత్ తాయారు చేయడం భవిష్యత్ లో ప్లాస్టిక్ నివారణ వైపు అడుగులు వేయడానికి సహకరిస్తుందని ఆ హోటల్ యాజమాన్యం చెబుతోంది.

Also Read: UNSC Meeting: సముద్ర మార్గ వాణిజ్య పరిమితులు తొలగాల్సిందే’.. ఐరాస భద్రతా మండలిని ఉద్దేశించి ప్రధాని మోదీ

Bangladesh: బంగ్లాదేశ్ లో హిందూ ఆలయాలు, షాపులపై దాడి..10 మంది అరెస్ట్.. అదుపులోకి వచ్చిన పరిస్థితి