నోబెల్‌ శాంతి బహుమతి రేసులో డోనాల్డ్‌ ట్రంప్‌.. అవార్డు నామినేషన్ల లిస్టులో అమెరికా తాజా మాజీ అధ్యక్షుడు

|

Feb 01, 2021 | 3:07 PM

ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి అవార్డు రేసులో అమెరికా తాజా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఉన్నట్లు..

నోబెల్‌ శాంతి బహుమతి రేసులో డోనాల్డ్‌ ట్రంప్‌.. అవార్డు నామినేషన్ల లిస్టులో అమెరికా తాజా మాజీ అధ్యక్షుడు
Follow us on

ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి అవార్డు రేసులో అమెరికా తాజా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఉన్నట్లు తెలుస్తుంది. అవార్డుకోసం స్వీకరించిన నామినేషన్‌లలో ట్రంప్‌ పేరు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది అక్టోబర్‌లో బహుకరించే ఈ శాంతి పురస్కారం రేసులో డొనాల్డ్‌ ట్రంప్‌ పేరు వినిపించడం ఆసక్తిని రేపుతుంది.

ట్రంప్‌తో పాటు ఈ అవార్డు నామినేషన్‌లో స్వీడన్‌కు చెందిన బాల పర్యావరణవేత్త 18 ఏళ్ల బాలిక, గ్రెటా థన్‌బర్గ్‌, రష్యా అసమ్మతి నేత అలెక్సీ నావల్సీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)లు కూడా ఉన్నాయి.

గ్రెటా థన్‌బర్గ్‌ చిన్న వయసులోనే పర్యావరణానికి సంబంధించిన కార్యక్రమాలు చేపడుతూ… అంతర్జాతీయ సదస్సుల్లో పర్యావరణ సంరక్షణపై ధైర్యంగా ఆమె గళం విప్పుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆమె ఎన్నో అంతర్జాతీయ అవార్డులకు అందుకుంది. ఈ నేపథ్యంలో గ్రెటా థన్‌ బర్గ్ కు నోబెల్‌ బహుమతి ఇవ్వాలనే డిమాండ్‌ పెరుగుతుంది.

మానవాళిని పట్టి పీడిస్తున్న కరోనాపై పోరాటంలో ప్రపంచ దేశాల మధ్య సమన్వయం కోసం కృషి చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఈ అవార్డు లభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

 

అప్పుల కుప్పపై అమెరికా మాజీ అధ్యక్షుడు..? ట్రంప్‌ కంపెనీల నుంచి ఒక్కొక్కటిగా వైదొలుగుతున్న ఆర్థిక సంస్థలు