ట్రంప్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం.. దావోస్ వెళ్తుండగా విమానంలో సాంకేతిక సమస్య..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ట్రంప్ ప్రయాణిస్తున్న'ఎయిర్ ఫోర్స్ వన్' విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో దావోస్ వెళ్లాల్సిన విమానం వాషింగ్టన్‌కు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. వైట్ హౌస్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, విమానంలో చిన్న 'విద్యుత్ లోపం'ను సిబ్బంది గుర్తించారు.

ట్రంప్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం.. దావోస్ వెళ్తుండగా విమానంలో సాంకేతిక సమస్య..!
Donal Trump Air Force One

Updated on: Jan 21, 2026 | 5:43 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ట్రంప్ ప్రయాణిస్తున్న’ఎయిర్ ఫోర్స్ వన్’ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో దావోస్ వెళ్లాల్సిన విమానం వాషింగ్టన్‌కు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. వైట్ హౌస్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, విమానంలో చిన్న ‘విద్యుత్ లోపం’ను సిబ్బంది గుర్తించారు. ఆ తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా యు-టర్న్ చేయమని విమానానికి సూచించారు.

న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్ సమీపంలో విమానం దారి మళ్లించిన తర్వాత బుధవారం (జనవరి 21) ఉదయం 9:30 గంటల ప్రాంతంలో మేరీల్యాండ్‌లో సురక్షితంగా ల్యాండ్ అయిందని ఫ్లైట్ ట్రాకింగ్ డేటా తెలిపింది. అయితే, అధ్యక్షుడు ట్రంప్ దావోస్ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదు. ల్యాండింగ్ అయిన దాదాపు గంట తర్వాత, ఆయన మరో స్టాండ్‌బై విమానం (బోయింగ్ 747-200B)లో స్విట్జర్లాండ్‌కు బయలుదేరారు.

ప్రస్తుతం ట్రంప్ ఉపయోగిస్తున్న రెండు బోయింగ్ 747-200B విమానాలు దాదాపు 40 సంవత్సరాల పాతవి. బోయింగ్ కొత్త విమానాలపై పని చేస్తోంది. కానీ ప్రాజెక్ట్ జాప్యాలు పాత విమానాల వాడకాన్ని కొనసాగించడానికి దారితీశాయి. ఖతార్ అందించే లగ్జరీ బోయింగ్ 747-8 జంబో జెట్‌లను కూడా భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అమెరికా భద్రతా అధికారులు అప్‌గ్రేడ్ చేస్తున్నారు.

ప్రపంచ ఆర్థిక వేదిక (WEF)లో పాల్గొనడానికి ట్రంప్ దావోస్‌కు వెళుతున్నారు. అక్కడ బుధవారం సాయంత్రం తన ప్రతిష్టాత్మకమైన “గ్రీన్‌ల్యాండ్ విధానం”పై ప్రసంగిస్తారు. ఆయన ఒక ప్రత్యేక ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా నిర్వహిస్తారు. దీనికి ఏడుగురు ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్తలను కూడా ఆహ్వానించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..