బ్రెగ్జిట్ ఒప్పందాన్ని కుదర్చలేకపోయా: థెరిసా మే భావోద్వేగం

| Edited By:

Jun 07, 2019 | 9:49 AM

బ్రెగ్జిట్ ఒప్పందాన్ని కుదర్చలేకపోయాననే అసంతృప్తి తనలో మిగిలిపోయిందని బ్రిటన్ ప్రధాని థెరిసా మే భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ఇది ఎప్పటికీ నాకు విచారకంగానే అనిపిస్తుంది. నా తరువాత బాధ్యతలు చేపట్టే ప్రధాని బ్రెగ్జిట్‌ను ముందుకు నడిపిస్తారని అనుకుంటున్నాను’’ అంటూ మే పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధానికి సైనిక చర్యలు ప్రారంభించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఫ్రాన్స్‌లోని నార్మండేలో జరిగిన డీ-డే వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ యుద్ధంలో స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీర జవాన్లకు […]

బ్రెగ్జిట్ ఒప్పందాన్ని కుదర్చలేకపోయా: థెరిసా మే భావోద్వేగం
Follow us on

బ్రెగ్జిట్ ఒప్పందాన్ని కుదర్చలేకపోయాననే అసంతృప్తి తనలో మిగిలిపోయిందని బ్రిటన్ ప్రధాని థెరిసా మే భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ఇది ఎప్పటికీ నాకు విచారకంగానే అనిపిస్తుంది. నా తరువాత బాధ్యతలు చేపట్టే ప్రధాని బ్రెగ్జిట్‌ను ముందుకు నడిపిస్తారని అనుకుంటున్నాను’’ అంటూ మే పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధానికి సైనిక చర్యలు ప్రారంభించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఫ్రాన్స్‌లోని నార్మండేలో జరిగిన డీ-డే వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ యుద్ధంలో స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీర జవాన్లకు ఆమె నివాళులు అర్పించారు. సైనికుల గురించి మాట్లాడటంపై గర్వంగా ఉందని ఆమె తెలిపారు. అప్పటి సైనికుల కాలాన్ని ఓ ప్రత్యేకమైన, గొప్ప తరంగా ఆమె అభివర్ణించారు.

అయితే బ్రిటన్ ప్రధాని పదవి నుంచి థెరిసా మే ఇవాళ అధికారికంగా తప్పుకోనున్నారు. ఆమె తరువాత బ్రిటన్ ప్రధాని పీఠం దక్కించుకునేందుకు కన్జర్వేటివ్ పార్టీ నుంచి 11 మంది ఎంపీలు పోటీ పడుతున్నారు. ఈ రేసులో విదేశాంగ మాజీ కార్యదర్శి బోరిస్ జాన్సన్ ముందు వరుసలో ఉన్నారు. అయితే అధికారికంగా దీనిపై నిర్ణయం రావాల్సి ఉంది.