Viral News: పెళ్లి వేడుకలో కేక్ ఎక్కువగా తిన్నాడని బిల్లు వేసిన కొత్త జంట.. షాకింగ్ రిప్లై ఇచ్చిన అతిథి

|

Oct 03, 2021 | 1:58 PM

Wedding Cake-Viral News: ఇక్కడ ఏ దేశంలో ఏ సంప్రదాయంలో పెళ్లిళ్లు జరిగినా కుటుంబ సభ్యులను, స్నేహితులను అతిధులుగా ఆహ్వానిస్తారు. తమ స్థాయికి తగినట్లుగా..

Viral News: పెళ్లి వేడుకలో కేక్ ఎక్కువగా తిన్నాడని బిల్లు వేసిన కొత్త జంట.. షాకింగ్ రిప్లై ఇచ్చిన అతిథి
Cake Pieces
Follow us on

Wedding Cake-Viral News: ఇక్కడ ఏ దేశంలో ఏ సంప్రదాయంలో పెళ్లిళ్లు జరిగినా కుటుంబ సభ్యులను, స్నేహితులను అతిధులుగా ఆహ్వానిస్తారు. తమ స్థాయికి తగినట్లుగా వివాహక వేడుకను జరుపుకుంటారు. ఇక పెళ్లిలో పెట్టె భోజనం గురించి.. పెట్టె ఐటెమ్స్ గురించి పెళ్ళికి హాజరైన అతిధులు మాట్లాడుకుంటారు. అయితే ఓ పెళ్ళికి వెళ్లిన బంధువుకి తమ పెళ్ళిలో ఎక్కువ తిన్నావంటూ  బిల్లు పంపించి షాక్ ఇచ్చారు. అవును ఇటీవల జరిగిన ఓ పెళ్లి వేడుకలో అతిథి ఎక్కువగా తిన్నాడని అందుకు బిల్లు కట్టాల్సిందేనని నవజంట వాట్సప్ లో బిల్లుని పంపించింది. అయితే ఆ బిల్లుకి సదరు అతిధి మంచి ఘాటైన రిప్లై ఇస్తూ.. ఆ వాట్సాప్ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళ్తే..

గ్రేట్ బ్రిటన్ లోని ఒక వ్యక్తి తన ఫ్రెండ్ మ్యారేజ్‌కు వెళ్లాడు. ఆ వేడుకలో కేక్ నవ దంపతులు కేక్ ని కట్ చేశారు. అనంతరం ఆ కేక్ ముక్కలను అతిధులకు అందించారు. అప్పుడు అతిధి ఓ ముక్కను ఎక్స్ ట్రాగా తిన్నాడు.  అయితే కొన్ని రోజుల తర్వాత పెళ్ళికి వచ్చిన అతిథికి కొత్త జంట ఓ మెసేజ్ చేశారు. నువ్వు మా పెళ్ళికి వచ్చిన కేక్ ముక్కలు రెండు తిన్నావు.. ఒకటి కంటే ఎక్కువగా తిన్నందుకు 3.66 పౌండ్స్ మాకు చెల్లించామని చెప్పారు. మన దేశ కరెన్సీలో రూ. కేక్ ముక్క ఎక్కువ తిన్నందుకు రూ.366 చెల్లించాలని కొత్త జంట చెప్పారు. అంతేకాదు నువ్వు ఎక్కువ తిన్నావని మేము సీసీటీవీ ఫుటేజ్ చేసుకుని కన్ఫామ్ చేసుకున్నామని కూడా చెప్పారు. మేము మా పెళ్ళికి వచ్చే ముందే అతిధులకు ఒకేఒక్క వెడ్డింగ్ కేక్ పీస్ ఇవ్వనున్నమని చెప్పాము.. అయినా నువ్వు ఎక్కువ తిన్నావు కనుక ఫైన్ కట్టు అని చెప్పారు.

ఇది చూసిన అతిధి షాక్ తినడమే కాదు.. ఆ కొత్త జంటకు షాకింగ్ రిప్లై కూడా ఇచ్చాడు. “కొత్తగా పెళ్లి చేసుకున్న జంటకు నేను 3.66 పౌండ్స్ చెల్లిస్తాను అయితే మీకు బహుమతిగా కొంత సొమ్ముని, పెళ్ళికి వెళ్లి తిరిగి రావడానికి చార్జెస్, పెళ్లికోసం ధరించిన దుస్తులకు, అదనపు షిప్ట్ లో పని చేసే అవకాశం కోల్పోయాను. సో వీటన్నికి ఈ కొత్త జంట ఖరీదు కట్టి.. నాకు నా డబ్బులను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.. అయితే అందులో నుంచి మీ కేక్ ముక్క కాస్ట్ మినహాయించుకుకోవాలని చెప్పారు. సదరు వ్యక్తి తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read:  గోవాలో 18వ శతాబ్దంనాటి అతిపురాతన ఆలయం.. హిందువులకు మాత్రమే ప్రవేశం..