Corona Vaccine: ప్రపంచంలో సంపన్నదేశాల్లో మాత్రమే వేగంగా వ్యాక్సినేషన్.. చాలా పేద దేశాల్లో వ్యాక్సిన్ అలికిడే లేదు!

|

Apr 09, 2021 | 4:09 PM

రోనా టీకా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని దేశాల్లో అందుబాటులో ఉందో తెలుసా? కరోనా వ్యాక్సిన్ ఎక్కువగా ఏ దేశాల ప్రజలకు ఇస్తున్నారో తెలుసా?

Corona Vaccine: ప్రపంచంలో సంపన్నదేశాల్లో మాత్రమే వేగంగా వ్యాక్సినేషన్.. చాలా పేద దేశాల్లో వ్యాక్సిన్ అలికిడే లేదు!
Corona Vaccination
Follow us on

Corona Vaccine: ఇప్పుడు ఇండియాలో వ్యాక్సినేషన్ పై ఒక విధంగా యుద్ధం మొదలైందని చెప్పొచ్చు. రాజకీయంగా వివక్ష చూపుతున్నారని బీజేపీ యేతర రాష్ట్రాలు గొడవ మొదలెట్టాయి. అసలు కరోనా టీకా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని దేశాల్లో అందుబాటులో ఉందో తెలుసా? కరోనా వ్యాక్సిన్ ఎక్కువగా ఏ దేశాల ప్రజలకు ఇస్తున్నారో తెలుసా? వ్యాక్సిన్ పై రాజకీయంగా అసమానతలు చూపిస్తున్నారని అనుకుంటున్న వేళలో ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడమూ అవసరమే.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ సంపన్న దేశాలలో మాత్రమే వేగంగా జరుగుతోంది. నిజానికి 5 శాతం జనాభాకు మాత్రమే సరిపోయే వ్యాక్సిన్ ఇప్పుడు అందుబాటులో ఉంది. అయినా కొన్ని సంపన్న దేశాల్లో మాత్రం ఆ శాతం కంటే ఎక్కువగానే వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంది. గురువారం నాటికి ఉన్న సమాచారం ప్రకారం మొత్తం టకాల్లో 40 శాతం కేవలం 27 సంపన్నదేశాలలోనే వినియోగిస్తున్నారని తెలిసింది. ఇక ఈ దేశాల మొత్తం జనాభా ప్రపంచ జనాభాలో 11 శాతం మాత్రమే. 11 శాతం ప్రజలున్న దేశాలకు దేశాలకు 40 శాతం టీకాలు అందితే.. మిగిలిన 89 శాతం ప్రజలున్న దేశాలకు 60 శాతం మాత్రమే అందుతున్నాయన్నమాట.

బ్లూమ్ బెర్గ్ కోవిడ్ వ్యాక్సిన్ ట్రాకర్ వెల్లడించిన వివరాల ప్రకారం అత్యధిక ఆదాయం ఉన్న దేశాలు పేద దేశాల కంటే 25 రేట్లు ఎక్కువ టీకాలను వేశాయి. ఆ సంత ఇప్పటివరకు 154 దేశాల్లో వేసిన 72.2 కోట్ల డోస్ లను పరిగణనలోకి తీసుకుని లెక్కలు చెప్పింది.

ఆ సంస్థ చెబుతున్న లెక్కల ప్రకారం.. ప్రపంచంలో అమెరికా జనాభా 4.3శాతం కాగా.. మొత్తం వ్యాక్సినేషన్ 24 శాతం ఇక్కడే జరిగింది. అదే పాకిస్థాన్ లో జనాభా ప్రపంచంలో 2.7 శాతానికి సమానం అయితే, ఇక్కడ కేవలం 0.1 శాతానికి మాత్రమే టీకాలు లభించాయి. చాలా సంపన్న దేశాలు ముందుగానే టీకాలు కొనిపెట్టుకోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని ఆ సంస్థ చెబుతోంది.

అమెరికా టీకాల విషయంలో చాలా ముందస్తు జాగ్రత్తలతో ఉంది. అక్కడ వచ్చే మూడు నెలల్లో 75 శాతం మందికి వ్యాక్సిన్ వేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఇదిలా ఉంటె.. ప్రపంచంలోని సగానికి పైగా దేశాలు ఇప్పటి వరకూ 1 శాతం కూడా వ్యాక్సిన్ ప్రజలకు అందించలేకపోయాయి. అంతెందుకు దాదాపుగా 40 దేశాల్లో ఎంతమందికి టీకాలు వేస్తున్నారనే సమాచారమూ అందుబాటులో లేదు.

Also Read: Madhya Pradesh: నాకు కాదు కరోనా.. లోపలున్నవాడికి.. అంబులెన్స్ ఆపి చెరకురసం కోసం వచ్చిన ఆరోగ్య కార్యకర్త!

Corona Cases India: దేశంలో కరోనా కల్లోలం.. కొత్తగా 1.31 లక్షల పాజిటివ్ కేసులు, 802 మరణాలు.!