COP 28: ‘ప్రపంచ నాయకులంతా ఏక తాటిపైకి రావాలి’.. కాప్‌28లో సమ్మిట్‌లో సద్గురు

|

Dec 01, 2023 | 9:46 PM

ఇక ఈ వేడుకులకు సేవ్‌ సాయిల్ మూవ్‌మెంట్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సదగ్గురు జగ్గీ వాసుదేవన్‌ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక ఉపన్యాసం ఇచ్చారు. ఆయన తన ప్రసంగంలో మట్టి ప్రాధాన్యతను వివరించారు. మట్టి కాపాడటంలో ప్రపంచ నాయకులందరూ ఏకతాటిపై రావాలని.. ప్రజల్లో విశ్వాసం నింపాలని సద్గురు కోరారు. ఈ విషయమై సద్గురు ట్విట్టర్‌ వేదికగా తన ఆలోచనలు పంచుకున్నారు...

COP 28: ప్రపంచ నాయకులంతా ఏక తాటిపైకి రావాలి.. కాప్‌28లో సమ్మిట్‌లో సద్గురు
Sadhguru
Follow us on

కాన్ఫెరెన్స్ ఆఫ్‌ పార్టీస్‌ 28వ సమ్మిట్ దుబాయ్‌ వేదికగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, యూకే ప్రధాని రిషి సునక్‌, ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడు అజయ్‌ బంగా, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌తో పాటు పలు దేశాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు.

ఇక ఈ వేడుకులకు సేవ్‌ సాయిల్ మూవ్‌మెంట్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సదగ్గురు జగ్గీ వాసుదేవన్‌ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక ఉపన్యాసం ఇచ్చారు. ఆయన తన ప్రసంగంలో మట్టి ప్రాధాన్యతను వివరించారు. మట్టి కాపాడటంలో ప్రపంచ నాయకులందరూ ఏకతాటిపై రావాలని.. ప్రజల్లో విశ్వాసం నింపాలని సద్గురు కోరారు. ఈ విషయమై సద్గురు ట్విట్టర్‌ వేదికగా తన ఆలోచనలు పంచుకున్నారు.

సద్గురు ట్వీట్ చేస్తూ.. ‘మీరు ఎవరు.. మీరు ఏం నమ్ముతారు.. మీరు స్వర్గానికి వెళతారా.. నరకానికి వెళతారా అన్నది ముఖ్యం కాదు. అందరం ఒకే నేల నుంచి వచ్చాం. అదే మట్టి నుంచి వచ్చిన తిండి తింటున్నాం. చివరికి చనిపోయిన తర్వాత కూడా అదే మట్టిలోకి వెళ్తాం. మట్టి అనేది అంతిమ ఏకీకరణ. భూగ్రహం మీద మట్టి అక్షరాలా జీవనవైవిధ్యానికి తల్లి. సుసంపన్నమైన నేల లేనిది, జీవన వైవిధ్యం అసాధ్యం. జీన వైవిధ్యానికి తల్లిలాంటి మట్టి.. పునర్జీవన విధానాలను అమలు చేయడానికి.. ప్రజలను ప్రభావితం చేయడానికి నాయకులు కీలక పాత్ర పోషించాలి’ అని సద్గురు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే మట్టిని కాపాడుకోవాలనే సందేశాన్ని వివరిస్తూ సద్గురు 2022లో సేవ్‌ సాయిల్ ఉదమ్మాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమాన్ని అంరత్జాతీయంగా విస్తరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కలిగించేందుకు సద్గురు బైక్‌పై యాత్ర నిర్వహించారు. 95% ఆహారానికి మూలమైన నేల అంతరించిపోయే ప్రమాదం భూమిపై జీవరాశులను ప్రమాదంలోకి నెడుతుందని వివరించారు. సద్గురు 100 రోజుల, 30,000 కిలోమీటర్ల సోలో బైక్ యాత్రను ప్రారంభించి 3.91 బిలియన్ల మందిని చేరుకున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..