Climate Activists Protest: జీ7 దేశాలకు నిరసన సెగ.. అలాంటి దేశాల వల్లే వాతావరణానికి ముప్పు అంటూ..

Climate Activists Protest: G7 సదస్సుకు భారీ ఎత్తున నిరసన సెగ తగులుతోంది. ఓవైపు జర్మనీలో నిరసనలు జరుగుతుండగానే.. ప్యారిస్‌లోనూ ఇలాంటి..

Climate Activists Protest: జీ7 దేశాలకు నిరసన సెగ.. అలాంటి దేశాల వల్లే వాతావరణానికి ముప్పు అంటూ..
Climate Activists Block Imf
Follow us

|

Updated on: Jun 28, 2022 | 9:40 AM

Climate Activists Protest: G7 సదస్సుకు భారీ ఎత్తున నిరసన సెగ తగులుతోంది. ఓవైపు జర్మనీలో నిరసనలు జరుగుతుండగానే.. ప్యారిస్‌లోనూ ఇలాంటి ఆందోళనలు కనిపించాయి. పారిస్‌లో వినూత్న నిరసనలకు దిగారు కొందరు క్లైమేట్‌ యాక్టివిస్టులు. ప్రపంచ బ్యాంకు ఎదుట ధర్నా చేశారు. ఎంట్రీ గేట్‌కి అడ్డంగా నిలబడడమేకాకుండా.. తమ చేతికి గమ్‌ని పూసుకుని, తలుపు అద్దాలకు అతికించుకున్నారు. ఎవరూ లోపలికి వెళ్లకుండా, లోపలి వారు బయటకు రాకుండా అడ్డుకున్నారు. అయితే, ఈ నిరసనలకు కారణం వాతావరణంలో మార్పులకు కారణమవుతున్న అభివృద్ధి చెందుతున్న దేశాలే అని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఈ దేశాలకు ప్రపంచ బ్యాంకు రుణాలు ఇవ్వొద్దంటున్నారు క్లైమేట్‌ యాక్టివిస్టులు. ఇలాంటి దేశాలకు అప్పు ఇవ్వడం వల్ల అనేక రకాల పరిశ్రమలు ఏర్పడి ఆ ప్రభావం ప్రపంచంపై పడుతోందంటున్నారు. అభివృద్ధి చెందే దేశాలకు కాలుష్యంపై పోరాడే వనరులను సమకూర్చాలని పిలుపునిచ్చారు. ఆయా దేశాల కాలుష్యం వల్ల వారి తొలి బాధితులుగా ఉన్నారని, వారి బాధ్యత అందరికన్నా చివరిగా ఉంటోందని ఆరోపించారు.

జర్మనీలో జరుగుతున్న జీ7 సమ్మిట్‌లో వాతావరణ కాలుష్య కారక దేశాలకు వ్యతిరేకంగా వెంటనే తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. భారత్‌, చైనా, సౌతాఫ్రికా, వంటి దేశాలకు రుణాలను ఇవ్వొద్దంటున్నారు వాతావరణ కార్యకర్తలు. అంతేకాదు.. శిలాజ ఇంధనాలపై తక్షణమే వేటు వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు జర్మనీలోనూ నిరసనలు కనిపించాయి. జీ7 సమావేశానికి వ్యతిరేకంగా వేలాది మంది నిరసన ప్రదర్శనలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉక్రెయిన్‌-రష్యా యుద్ధ ప్రభావం పడిందని.. వెంటనే ఆపే ప్రయత్నాలు చేయకపోతే ఆకలి చావులు పెరిగే అవకాశాలున్నాయన్నారు నిరసనకారులు. జీ7 దేశాలు మాత్రమే బతికితే సరిపోదని.. ప్రపంచ దేశాలన్నీ ఒకదానికి ఒకటి సహకరించుకుంటేనే ప్రజలు బతుకుతారన్నారు.