
నేరస్థులు పోలీసుల నుండి తప్పించుకోవడానికి మారువేషంలో నేరాలు చేస్తారు. లేదంటే నేరం చేసిన తర్వాత తమ మారువేషాన్ని మార్చుకుంటారని తరచుగా విని ఉండవచ్చు. అయితే బ్రిటన్‌లో విదేశీయుల పౌరసత్వం పొందడానికి ఒక మహిళ తన గుర్తింపును అనేకసార్లు మార్చుకున్న కేసు వెలుగులోకి వచ్చింది. ఒక బ్రిటిష్ మహిళ మంగళవారం(ఫిబ్రవరి 25) విగ్గు, ఇతర వేషధారణలు ధరించి డజనుకు పైగా విదేశీయులకు బ్రిటిష్ పౌరసత్వ పరీక్షను మోసపూరితంగా రాసినట్లు అంగీకరించింది.
61 ఏళ్ల జోసెఫిన్ మోరిస్, స్నారెస్‌బ్రూక్ క్రౌన్ కోర్టులో 13 మంది పురుషులు, మహిళలకు లైఫ్ ఇన్ యుకె పరీక్షను మోసపూరితంగా రాసినట్లు అంగీకరించింది. జూన్ 2022 – ఆగస్టు 2023 మధ్యకాలంలో నిజమైన దరఖాస్తుదారులలా కనిపించడానికి వారి తరపున పరీక్షకు హాజరు కావడానికి ఆ మహిళ వివిధ విగ్గులు, ఇతర వేషధారణలను ధరించిందని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో లింగ మార్పు కూడా ఉంటుంది.
ఆ మహిళ దేశవ్యాప్తంగా ఉన్న పరీక్షా కేంద్రాలను జాగ్రత్తగా ఎంచుకుంది. మారువేషాల్లో తనిఖీల నుండి తప్పించుకోవడానికి ముందస్తు ప్రణాళికతో కూడిన ఫ్లాన్‌ను అమలు చేసిందని హోం శాఖ ఇమ్మిగ్రేషన్ అధికారి ఫిలిప్ పార్ చెప్పారు. ఈ రకమైన నేరాలు చేసే చాలా మంది నేరస్థుల మాదిరిగానే, అమె ఉద్దేశ్యం డబ్బు సంపాదించడమే అని తెలిపారు.
బ్రిటిష్ చరిత్ర, విలువలు, సమాజంపై అవగాహనను కొలిచే 24 ప్రశ్నల పరీక్షలో శాశ్వత నివాసం లేదా పౌరసత్వం పొందడానికి ఉత్తీర్ణత సాధించాలి. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోతే, బ్రిటిష్ పౌరసత్వం పొందడం చాలా కష్టమవుతుంది. దీని కారణంగా వలస వచ్చిన ప్రజలు కూడా దానిని దాటడానికి చట్టవిరుద్ధమైన పద్ధతులను అనుసరిస్తారు.
ప్రస్తుతం UKలోని బ్రాంజ్‌ఫీల్డ్ జైలులో ఉన్న మోరిస్, కోర్టు విచారణకు వర్చువల్‌గా హాజరయ్యారు. దీనిలో మోరిస్ తాను ఇతరులతో కలిసి మోసం చేయడానికి కుట్ర పన్నానని ఒప్పుకున్నారు. ఇద్దరు వ్యక్తుల తాత్కాలిక డ్రైవింగ్ లైసెన్స్‌లను కలిగి ఉన్నానని ఒప్పుకున్నారు. ఇప్పుడు ఈ కేసులో ఆమెకు మే 20న శిక్ష ఖరారు కానుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..