అవిభక్త కవలలకు విముక్తి..100మంది వైద్యులు, 33 గంటల సర్జరీ సక్సెస్‌..

| Edited By: Ram Naramaneni

Aug 04, 2022 | 11:27 AM

వంద మందికి పైగా వైద్య సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. చిన్నారులకు సంబంధించిన ఈ ప్రత్యేక శస్త్ర చికిత్స కోసం వైద్యులు ఒంటరిగా నెలల తరబడి శిక్షణ తీసుకుని విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు.

అవిభక్త కవలలకు విముక్తి..100మంది వైద్యులు, 33 గంటల సర్జరీ సక్సెస్‌..
Brains Successfully Separat
Follow us on

ఈ ఇద్దరు కవలలు. కలిసే జన్మించారు. ఇద్దరి శరీరాలూ కలిసిపోయి వున్నాయి. చేతులు, కాళ్ళు, మిగతా శరీర భాగాలూ విడివిడిగానే వున్నాయి. కానీ, తల భాగం మాత్రమే కలిసిపోయి వుంది. మహబూబాబాద్ జిల్లా.. దంతాలవారి మండలం వీరిశెట్టి గ్రామానికి చెందిన మురళి, నాగలక్ష్మీ దంపతులకు 2002లో జన్మించారు వీణావాణి. తెలుగు రాష్ట్రాల్లో వీణా – వాణి ఓ సంచలనం. చాలా కాలం పాటు నీలోఫర్ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకున్న వీరు.. 2017 నుంచి స్టేట్ హోంలో ఉంటున్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో వీరికి సర్జరీ చేయాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. ఆ ప్రతిపాదనలు సాగుతూ సాగుతూ వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఈ అవిభక్త కవలల కష్టాలు తీరలేదు. వీణ – వాణి ఇద్దరూ ఒకర్ని ఒకరు నేరుగా చూసుకోలేరు. ఒకరు ఒక వైపుకి తిరిగి వుంటే, ఇంకొకరు ఇంకో వైపుకు తిరిగి వుంటారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే ఇద్దరు చదువుల్లో మాత్రం రాణిస్తూ వస్తున్నారు. ఇలాంటిదే తాజాగా ఇద్దరు అబ్బాయిలు తలలు అత్తుకుని జన్మించారు. వారికి సర్జరీ చేసిన వైద్యులు ఇద్దరీ సురక్షితంగా విడదీసి ఆపరేషన్‌ సక్సెస్‌ చేశారు.

ప్రపంచంలో పుట్టిన దాదాపు 60,000 మందిలో ఒకరికి ఇలాంటి లోపం ఉంటుందని సమాచారం. తాజాగా బ్రెజిల్‌లో ఇద్దరు అబ్బాయిలు తలలు అతుకుని జన్మించారు. ఇద్దరు అబ్బాయిలు… బ్రెజిలియన్ అబ్బాయిలు, బెర్నార్డో మరియు ఆర్థర్ లిమా కలిసి కవలలుగా జన్మించారు. వారి మెదళ్ళు సాధారణంగా వేరుగా ఉన్నాయి. కానీ అవి కొంత మెదడు కణజాలాన్ని పంచుకున్నట్టుగా ఉన్నాయి. దీనినే ‘క్రానియోఫేగస్ ట్విన్స్’ అంటారు. బ్రెయిన్ గ్రాఫ్ట్స్‌తో పుట్టిన సోదరులకు ఇంగ్లండ్‌కు చెందిన ఓ సర్జన్‌ నేతృత్వంలో విజయవంతంగా ఆపరేషన్‌ చేశారు. ఇద్దరు 4 సంవత్సరాల వయసు కలిగిన వారే. ఇప్పటివరకు ఏడు శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. లండన్‌లోని ఓ ఆసుపత్రికి చెందిన డాక్టర్ నూర్ జీలానీ వైద్య సలహా మేరకు ఈ శస్త్రచికిత్స జరిగింది. దీని ప్రకారం చివరి రెండు ఆపరేషన్లు జరిగాయి. ఇది 33 గంటల పాటు కొనసాగింది. ఇద్దరు అబ్బాయిల మెదళ్ళు పుట్టుకతోనే దాదాపు కలిసిపోయాయి.

వంద మందికి పైగా వైద్య సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. చిన్నారులకు సంబంధించిన ఈ ప్రత్యేక శస్త్ర చికిత్స కోసం వైద్యులు ఒంటరిగా నెలల తరబడి శిక్షణ తీసుకుని విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. ఇద్దరు అబ్బాయిల తల్లిదండ్రులు దాదాపు రెండున్నరేళ్ల క్రితం బ్రెజిల్‌లోని ఆసుపత్రికి వచ్చారు. నాటి నుంచి నేటి వరకు వారు ఆస్పత్రిలో అంతర్భాగంగా మారిపోయినట్టుగా ఓ వైద్యుడు తెలిపారు. డాక్టర్ జీలానీ ఈ శస్త్రచికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని స్వచ్ఛంద సంస్థ ద్వారా సమకూర్చారు. ఇది చాలా కష్టమైన ఆపరేషన్ అని వైద్యులు తెలిపారు. చాలా మంది వైద్యులు ఇది సాధ్యమని భావించరు. అయితే ఇప్పుడు అది సక్సెస్ అయిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రపంచంలో పుట్టిన దాదాపు 60,000 మందిలో ఒకరికి ఇలాంటి లోపం ఉంటుందని సమాచారం. ఇద్దరు అబ్బాయిలు ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారు బాగానే ఉన్నారని చెప్పారు. ఆరు నెలల పాటు చిన్నారులు వైద్యుల పర్యవేక్షణలోనే, వైద్యం తీసుకోవాలని పేర్కొన్నారు.

అవిభక్త కవలలుగా జన్మించిన బ్రెజిల్‌ సోదరులకు విముక్తి లభించింది. కానీ, వీరిలాగే తలలు అతుక్కుని జన్మించిన మన వీణ-వాణి మాత్రం 20సంవత్సరాలుగా ఇంకా అలాగే వుండి పోయారు. చదువుల్లో రాణిస్తున్న వీణవాణిలకు కూడా త్వరలోనే మంచి రోజులు రావాలని కోరుకుందాం.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి