PM Modi: ఇండోనేషియాలో మోదీ రెండో రోజు పర్యటన.. బ్రహ్మోస్ క్షిపణిపై కీలక ఒప్పందాలు..!

PM Modi Indonesia Visit: ప్రధానమంత్రి మోదీ ఇండోనేషియాలో పర్యటించడం ఇది నాలుగోసారి కాగా, 2018 తర్వాత ఇది ఆయన రెండో ద్వైపాక్షిక పర్యటన. ఆయనకు రెండు రోజుల పాటు తీరికలేని కార్యక్రమాలు ఉన్నాయి. ఇండోనేషియా అధ్యక్షుడితో విస్తృతంగా చర్చలు జరపనున్నారు. ఈ పర్యటన..

PM Modi: ఇండోనేషియాలో మోదీ రెండో రోజు పర్యటన.. బ్రహ్మోస్ క్షిపణిపై కీలక ఒప్పందాలు..!
Pm Modi Indonesia Visit

Updated on: Jul 07, 2026 | 8:59 AM

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల ఇండోనేషియా పర్యటన కొనసాగుతోంది.ఈ పర్యటనలో భాగంగా కీలక రంగాలలో సహకారాన్ని విస్తరించడంపై దృష్టి సారించనుంది. మోదీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా సోమవారం జకార్తాకు చేరుకున్నారు. అక్కడ ఇండోనేషియాలోని భారతీయ సమాజం ఆయనకు ఘన స్వాగతం పలికింది. అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు మోదీ జూలై 6 నుండి 8 వరకు ఇండోనేషియాలో పర్యటిస్తున్నారు. ఇతర నాయకులతో పాటు అధ్యక్షుడు స్వయంగా విమానాశ్రయానికి వచ్చి ప్రధానమంత్రికి స్వాగతం పలికారు.

భారతీయ సమాజం “భారత్ మాతా కీ జై” “మోదీ” అనే నినాదాలతో ప్రధానికి స్వాగతం పలికింది. విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే, ఆయన ఒక సాంస్కృతిక ప్రదర్శనను వీక్షించారు. భారత ప్రధాని జకార్తాకు రాకముందే అక్కడ నివసిస్తున్న భారతీయులు ఆయన పర్యటన పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నేను ప్రధాని మోదీని ఇంత దగ్గరగా చూడటం ఇదే మొదటిసారి.. తాము చాలా ఉత్సాహంగా ఉన్నాము అంటే అక్కడి భారతీయులు పేర్కొన్నారు.

జకార్తా విమానాశ్రయంలో అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో తనకు ఇచ్చిన స్వాగతానికి తాను ఎంతగానో ముగ్ధుడయ్యానని ప్రధానమంత్రి మోదీ అన్నారు. ఈ భాగస్వామ్యాన్ని వివిధ రంగాలలో మరింత బలోపేతం చేసే లక్ష్యంతో తాము చర్చలు జరుపుతామని ఆయన తెలిపారు. అలాగే రక్షణ, వాణిజ్యం, సముద్ర భద్రత, కీలక ఖనిజాలపై ఇరు దేశాలు విస్తృత చర్చలు జరపనున్నాయి. ప్రతిపాదిత బ్రహ్మోస్ క్షిపణి ఒప్పందం పూర్తికావడానికి మరింత చేరువయ్యే అవకాశం ఉండగా, భారత్-ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు పలు ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశం ఉంది.

ఇక ప్రధానమంత్రి మోదీ ఇండోనేషియాలో పర్యటించడం ఇది నాలుగోసారి కాగా, 2018 తర్వాత ఇది ఆయన రెండో ద్వైపాక్షిక పర్యటన. ఆయనకు రెండు రోజుల పాటు తీరికలేని కార్యక్రమాలు ఉన్నాయి. ఇండోనేషియా అధ్యక్షుడితో విస్తృతంగా చర్చలు జరపనున్నారు. ఈ పర్యటన నుంచి అనేక స్పష్టమైన ఫలితాలను తాము ఆశిస్తున్నామని రాయబారి అన్నారు.

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us