Cryptocurrency: క్రిప్టోకరెన్సీ గురించి షాకింగ్ న్యూస్.. సంచలన నివేదిక

క్రిప్టోకరెన్సీపై ఇంట్రెస్టింగ్‌ విషయాలు బయటికొచ్చాయి. దీనిపై టెన్షన్‌ పడుతున్నారు పర్యావరణ వేత్తలు. క్రిప్టోకరెన్సీపై వారి ఆందోళన ఎందుకు? ఈ స్టోరీలో చూద్దాం.

Cryptocurrency: క్రిప్టోకరెన్సీ గురించి షాకింగ్ న్యూస్.. సంచలన నివేదిక
Cryptocurrency
Follow us

|

Updated on: Sep 19, 2021 | 4:57 PM

క్రిప్టోకరెన్సీ మార్కెట్‌ విలువ రోజురోజుకూ గణనీయంగా పెరుగుతూనే ఉంది. దీంట్లో సరికొత్త రికార్డులను నమోదు చేస్తుంది బిట్‌కాయిన్‌. పూర్తిగా బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ ఉపయోగించి క్రిప్టోకరెన్సీ లావాదేవీలను జరుపుతుంటారు. దీన్ని మైనింగ్‌ చేయడం కోసం కంప్యూటర్లలో శక్తివంతమైన గ్రాఫిక్స్‌ కార్డులు వాడాల్సి వస్తోంది. కొన్ని రోజుల క్రితం క్రిప్టోకరెన్సీ మైనింగ్‌ కంప్యూటర్లలో వాడే గ్రాఫిక్స్‌ కార్డు ధరల్లో మార్పులు వచ్చేలా చేశాయి. తాజాగా క్రిప్టోకరెన్సీ మైనింగ్‌ చేయడంపై విస్తుపోయే విషయాలను వెల్లడించింది ఓ నివేదిక. బిట్‌కాయిన్‌, ఇతర క్రిప్టోకరెన్సీల మైనింగ్‌ చేయడంతో గణనీయమైన ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు వెలువడుతున్నట్లు ఓ సంస్థ జరిపిన అధ్యయనంలో తేలింది. ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు పర్యావరణానికి పెనుముప్పుగా మారుతుందన్నది ఆ నివేదిక సారాంశం. బిట్‌కాయిన్‌ మైనింగ్‌ కోసం వాడే కంప్యూటర్ల సగటు జీవితకాలం 1.3 సంవత్సరాలు మాత్రమే. డచ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఎకనామిస్ట్‌ అలెక్స్ డి వ్రీస్ దీనిపై కీ కామెంట్స్‌ చేశారు. ఐఫోన్‌ వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలతో పోలీస్తే బిట్‌కాయిన్‌ మైనింగ్‌ నుంచి వచ్చే ఎలక్ట్రినిక్‌ ఉద్గారాల సంఖ్య చాలా తక్కువని చెప్పారు వ్రీస్. బిట్‌కాయిన్‌ మైనింగ్‌ ద్వారా గడిచిన పన్నెండు నెలల్లో వచ్చిన వ్యర్థాల మొత్తం 30,700 టన్నులు. ఇది నెదర్లాండ్స్‌ లాంటి దేశాల ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలకు సమానం. ఫ్యూచర్‌లో బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టోకరెన్సీల మార్కెట్‌ భారీగా పెరుగుతుంది. లావాదేవీలు, స్టోరేజ్ విషయంలో క్రిప్టోకరెన్సీలను మైనింగ్‌ చేయడం కచ్చితం. దీంతో విపరీతంగా కంప్యూటర్ల వాడకం పెరిగి ఎలక్ట్రానిక్స్‌ వేస్టేజ్ పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పర్యావరణ వేత్తలు. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 53.6 మిలియన్ టన్నుల ఎలక్ట్రానిక్‌ ఉద్గారాలు వెలువడ్డాయి.

Also Read: Hero Vijay: సొంత తల్లిదండ్రులపైనే కేసు పెట్టిన హీరో విజయ్… ఎందుకంటే..?

ఆమెకు19, తాతకు 61.. వెరైటీ ప్రేమ కథ.. పెళ్లి చేసుకొని అందరికి షాక్‌ ఇచ్చారు..