Hero Vijay: సొంత తల్లిదండ్రులపైనే కేసు పెట్టిన హీరో విజయ్… ఎందుకంటే..?

అనుమతి లేకుండా తన పేరు ఉపయోగిస్తున్న తండ్రి చంద్రశేఖర్​పై హీరో విజయ్ కేసు పెట్టారు. ఆయన స్థాపించిన పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

Hero Vijay: సొంత తల్లిదండ్రులపైనే కేసు పెట్టిన హీరో విజయ్... ఎందుకంటే..?
Hero Vijay
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 19, 2021 | 7:23 PM

తమిళ హీరో విజయ్ తన తల్లిదండ్రులతో సహా 11 మందిపై చెన్నై సివిల్ కోర్టులో ఆదివారం కేసు పెట్టారు. అనుమతి లేకుండా తన పేరు యూజ్ చేస్తున్నారని ఫిర్యాదులో  విజయ్ పేర్కొన్నారు. ఇకముందూ తన పేరుతో ఎలాంటి కార్యక్రమాలు, మీటింగ్స్ నిర్వహించకుండా ఉండేందుకే విజయ్ ఈ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 27న దీనిపై విచారణ జరగనుంది. ఏడాది క్రితం విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్​ఏ చంద్రశేఖర్.. ‘ఆల్ ఇండియా తళపతి విజయ్ మక్కల్ ఇయ్యకమ్’ పేరుతో రాజకీయ పార్టీ స్థాపించారు. దీనికి ఆయన జనరల్ సెక్రటరీగా, శోభా చంద్రశేఖర్ కోశాధికారిగా ఉన్నారు. పార్టీ పెట్టిన కొన్నిరోజులకే విజయ్ వైపు నుంచి ఓ ప్రకటన వచ్చింది. “మా నాన్న పెట్టిన పార్టీతో నేరుగా, పరోక్షంగా గానీ నాకు సంబంధం లేదు. మా నాన్న పార్టీ పెట్టారని నా ఫ్యాన్స్ ఎవరూ అందులో చేరొద్దు” అని విజయ్ తన నోట్​లో పేర్కొన్నారు. పార్టీ కోసం తన పేరు, ఫొటో, ఫ్యాన్స్​ క్లబ్​ను గానీ దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటానని కూడా విజయ్ తెలిపారు.

విదేశీ కారుకు టాక్స్ కట్టిన విజయ్

కాగా విదేశీ కారు కొనుగోలు చేసి పన్ను చెల్లించకపోవడం పట్ల కోర్టుతో అక్షింతలు వేయించుకున్న విజయ్ ఎట్టకేలకు పన్ను పే చేశారు. తన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారుకు సంబంధించి రూ.40 లక్షల పన్ను చెల్లించాడు. విజయ్ గవర్నమెంట్ కు పన్ను చెల్లించిన విషయాన్ని రాష్ట్ర అధికారులు మద్రాస్ హైకోర్టుకు తెలియజేశారు. విజయ్ ఫారెన్ నుంచి దిగుమతి చేసుకున్న కారుకు పన్ను మినహాయింపు కోరుతూ 2012లో కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో ఇటీవల మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లక్ష రూపాయల ఫైన్ కట్టాలని, ఆ మొత్తాన్ని తమిళనాడు సీఎం కొవిడ్ రిలీఫ్ ఫండ్ కు అందజేయాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జరిమానాతో పాటు, కారుకు చెల్లించాల్సిన మొత్తం పన్ను రూ.40 లక్షలను కూడా విజయ్ చెల్లించినట్టు ప్రభుత్వ వర్గాలు కోర్టుకు నివేదించాయి.

Also Read: ఫుల్ స్వింగ్‌లో వైసీపీ.. అక్కడ క్లీన్ స్వీప్.. నారావారిపల్లిలో సైతం టీడీపీ ఓటమి

ఊదమంటే.. బ్రీత్‌ ఎనలైజర్‌తో పరారయిన మందు బాబులు​​​​​​

30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. రూ.1700 కోట్లకు ఐటీ నోటీసులు జారీ
కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. రూ.1700 కోట్లకు ఐటీ నోటీసులు జారీ