అల్‌ఖైదా చీఫ్ అమాన్ అల్-జవహరీను (ayman al-Zawahari) అమెరికా మట్టుబెట్టింది. అఫ్గానిస్థాన్ (Afghanistan) లో సోమవారం అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో అల్-ఖైదా చీఫ్ అమాన్ అల్-జవహిరి మరణించినట్లు తాలిబాన్ ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. జూలై 31 న కాబూల్ నగరంలోని షేర్పూర్ ప్రాంతంలోని నివాసంపై వైమానిక దాడి జరిగిందని.. ఈ దాడిలో జవహరి మరణించినట్లు వెల్లడించారు. ఈ దాడిని అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనగా అభివర్ణిస్తూ ముజాహిద్ ఖండించారు. అల్‌ఖైదా చీఫ్ అల్-జవహరీని హతమార్చడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Biden) స్పందించారు. కాబూల్‌లో జరిగిన వైమానిక దాడిలో అల్ ఖైదా నాయకుడు అమాన్ అల్-జవహిరి మరణించాడు. చివరకు న్యాయం జరిగింది. ఎంత కాలం పట్టినా.. ఎక్కడ దాక్కున్నా.. మా ప్రజలకు ముప్పు వాటిల్లితే.. అమెరికా కనిపెట్టి చర్యలు తీసుకుంటుంది.. అని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ పేర్కొన్నారు.
Tonight at 7:30 PM ET, President Biden will deliver remarks on a successful counterterrorism operation.
— The White House (@WhiteHouse) August 1, 2022
మీడియాలో కథనాల అనంతరం.. అఫ్గానిస్థాన్‌లో చేపట్టిన ఓ విజయవంతమైన ఉగ్రవాద నిరోధన ఆపరేషన్‌కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు జో బైడన్ కీలక ప్రకటన చేయనున్నట్లు శ్వేతసౌధం ప్రకటించింది. కాగా.. ఈజిప్టు సర్జన్ అయిన జవహిరి ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకరిగా మారాడు. 2001 సెప్టెంబర్ 11న అమెరికాపై జరిపిన దాడుల సూత్రధారుల్లో ఒకరిగా అల్-జవహరీని అమెరికా గుర్తించింది. 2011లో ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా దళాలు హతమార్చిన తర్వాత అల్-ఖైదా పగ్గాలను జవహరీ స్వీకరించాడు. మరోవైపు.. జవహరీ పై 25 మిలియన్ డాలర్ల రివార్డును అమెరికా గతంలో ప్రకటించింది.
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి