Air Canada Flight: పైలట్‌ దురుసు ప్రవర్తన.. సీటులో కూర్చునేందుకు నిరాకరించడంతో ప్రయాణికులను బయటకు..

|

Sep 07, 2023 | 1:25 PM

మానంలో ఇద్దరు మహిళా ప్రయాణికులను ఓ విమాన సంస్థ ఘోరంగా అవమానించింది. దుర్వాసన వస్తోన్న సీట్లలోనే కూర్చోవాలని సిబ్బంది బలవంతం చేశారు. ఆ సీట్లలో కూర్చోడానికి వారు నిరాకరించడంతో సిబ్బంది వారిని బయటికి పంపించారు. టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న ఎయిర్ కెనడా విమానంలో..

Air Canada Flight: పైలట్‌ దురుసు ప్రవర్తన.. సీటులో కూర్చునేందుకు నిరాకరించడంతో ప్రయాణికులను బయటకు..
Air Canada Flight
Follow us on

కెనడా, సెప్టెంబర్ 7: విమానంలో ఇద్దరు మహిళా ప్రయాణికులను ఓ విమాన సంస్థ ఘోరంగా అవమానించింది. దుర్వాసన వస్తోన్న సీట్లలోనే కూర్చోవాలని సిబ్బంది బలవంతం చేశారు. ఆ సీట్లలో కూర్చోడానికి వారు నిరాకరించడంతో సిబ్బంది వారిని బయటికి పంపించారు. టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న ఎయిర్ కెనడా విమానంలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..

ఆగస్టు 26వ తేదీన లాస్ వెగాస్ నుంచి మాంట్రియల్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న విమానంలో ఇద్దరు మహిళా ప్యాసింజర్లు తమకు కేటాయించిన సీట్లలో కూర్చునేందుకు నిరాకరించారు. అందుకు కారణం లేకపోలేదు. ఈ సీట్లపై ఎవరో వాంతులు చేసుకోవడంతో అక్కడ దుర్వాసన వచ్చింది. దీంతో తమకు వేరే సీట్లు కేటాయించాలని సిబ్బందిని కోరారు. నిజానికి ఇంతకు ముందు ఈ విమానంలో ప్రయాణించిన వ్యక్తి వాంతులు చేసుకున్నారని, ఎయిర్‌ కెనడా ఎక్కే ముందు సిబ్బంది సీట్లు సరిగ్గా శుభ్రం చేయకుండానే కవర్‌ చేశారు. పైగా సీటు బెల్టు, సీటు చూసేందుకు తడిగానే ఉన్నాయి. సీట్ల చుట్టూ వాంతి అవశేషాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాంతిని శుభ్రం చేయకుండా దుర్వాసనను కప్పిపుచ్చడానికి పెర్ఫ్యూమ్, కాఫీ గ్రైండ్‌ల సువాసనతో కవర్‌ చేయడానికి ఎయిర్‌ లైన్‌ విఫలయత్నం చేసింది.

కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. దీంతో ఇద్దరు మహిళా ప్రయాణికులు విమాన సిబ్బందికి సమాచారం అందించగా వారు క్షమాపణలు తెలిపారు. వేరే సీటు కేటాయించలేమని, ఇప్పటికే విమానం నిండిపోయిందని కేటాయించిన సీట్లలోనే కూర్చోవాలని చెప్పారు. దీంతో మహిళా ప్యాసింజర్లు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చిన పైలట్‌.. మీరు ఈ సీట్లలో కూర్చోలేకపోతే విమానం దిగి వెళ్లిపోవచ్చని సలహా ఇచ్చారు. లేదంటే సెక్యురిటీ సిబ్బంది కిందికి దింపేస్తారని హెచ్చరించారు. దీంతో సిబ్బంది వారిద్దరినీ విమానం బయటకు పంపించేశారు.

ఇవి కూడా చదవండి

అదే విమానంలో ఉన్న బెన్సన్‌ అనే మరో మహిళా ప్రయాణికురాలు ఈ తతంగాన్నంతటినీ ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. వాంతిని శుభ్రం చేయకుండా దుర్వాసన వస్తున్న సీట్లలో కూర్చోకుంటే దిగి వెళ్లిపొమ్మని పైలట్‌ వారితో దురుపుగా ప్రవర్తించారని, అనంతరం వారిని బయటకు పంపించినట్లు తన పోస్టులో పేర్కొంది. సుమారు 5 గంటలపాటు దుర్వాసన వస్తోన్న సీట్లలో కూర్చోవాలని పైటల్‌ ఆదేశించినట్లు తెలిపింది. ఎయిర్‌ కెనడా విమానంలో ఈ ఘటన జరగడం బాధాకరమని, కెనడాకు చెందిన పౌరురాలిగా ఈ ఘటన పట్ల సిగ్గుపడుతున్నట్లు తన పోస్టులో రాసుకొచ్చారు. ఐతే దింపేసిన మహిళా ప్రయాణికులే విమాన సిబ్బందితో అలభ్యంగా ప్రవర్తించినట్లు పైలట్‌ తెలిపాడు.

ఇక ఈ ఘటనపై స్పందించిన ఎయిర్‌ కెనడా కస్టమర్‌లకు క్షమాపణలు చెప్పింది. కాగా ఈ ఏడాది జులైలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. ఎయిర్ ఫ్రాన్స్ విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు రక్తంతో తడిసిన కార్పెట్‌ను చూసి భయాందోళనకు గురయ్యాడు. పారిస్ నుంచి టొరంటోకు వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. హబీబ్ బట్టా అనే వ్యక్తి తన అనుభవాన్ని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.