Taliban Beard Rules: అఫ్గానిస్థాన్(Afghanistan)లో తాలిబన్ల పాలన ప్రారంభం నాటి నుంచి అనేక కొత్త రూల్స్ వచ్చాయి. అధికారంలోకి రాక మునుపు బాలికల విద్యకు అంగీకరించిన తాలిబన్ నేతలు.. గత వారం దానిని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. అమ్మాయిలపై మళ్లీ కఠిన ఆంక్షలు తీసుకొచ్చారు. తాజాగా.. పురుషులకు(Rules For men) కూడా కొన్ని నిబంధనలు తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించారు. అఫ్గానిస్థాన్ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి ఇకపై కచ్చితంగా గడ్డం ఉండాల్సిందేనని కొత్త రూల్ తీసుకొచ్చారు. పాటించని వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన సమాచారం అంతర్జాతీయ మీడియాలో వెల్లడైంది. తాలిబన్ ప్రభుత్వంలోని పబ్లిక్ మోరాలిటీ మంత్రిత్వశాఖకు చెందిన కొందరు ప్రతినిధులు సోమవారం కాబుల్ సహా పలు నగరాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు.
ఉద్యోగులు తప్పనిసరిగా డ్రెస్‌కోడ్ పాటించాలని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు గడ్డం షేవ్ చేసుకోవద్దని, సంప్రదాయ వస్త్రధారణ మాత్రమే ధరించాలని, తలకి టోపీ పెట్టుకోవాలని ఆదేశించారు. డ్రెస్ కోడ్(Dress Code) పాటించని ఉద్యోగులను ఆఫీసుల్లోకి రానివద్దని కార్యాలయాలకు సూచించారు. అవసరమైతే ఉద్యోగం నుంచి కూడా తొలగిస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు అఫ్గానిస్థాన్ మహిళల స్వేచ్ఛను హరిస్తూ మరో కొత్త రూల్ తీసుకొచ్చారు. అదేంటంటే.. వారు ఒంటరిగా విమాన ప్రయాణాలు చేయకూడదంటూ ఆంక్షలు విధించారు. మగవాళ్ల తోడు లేకుండా.. ప్రయాణించాలనుకునే మహిళలను విమానంలోకి అనుమతించవద్దని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అక్కడ మహిళలను ఉద్యోగాల నుంచి తొలగించిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి..
Kim Jong Un: అమెరికాను అలా దారిలోకి తెచ్చుకోవాలనుకుంటున్న కిమ్.. ప్లాన్ ఏంటంటే..
Chittoor Murder Case: ఆత్మహత్య కాదు హత్యే.. సీఐ, ఎస్ఐ సహా ముగ్గురిపై సస్పెన్షన్ వేటు..