Taliban: వింత చేష్టల వీడియోలు వైరల్.. సాయుధ సేనలకు తాలిబన్ కీలక ఆదేశాలు

|

Aug 17, 2021 | 4:52 PM

ఆఫ్గనిస్థాన్ తమ ఆధీనంలోకి రావడంతో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. తాలిబన్ల వికృత చేష్టలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి.

Taliban: వింత చేష్టల వీడియోలు వైరల్.. సాయుధ సేనలకు తాలిబన్ కీలక ఆదేశాలు
Taliban
Follow us on

Afghanistan Crisis – Taliban: ఆఫ్గనిస్థాన్ తమ ఆధీనంలోకి రావడంతో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. తాలిబన్ల వింత చేష్టలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. అటు అంతర్జాతీయ మీడియా సైతం తాలిబన్ల ఆగడాలను ప్రసారం చేశాయి. ఈ నేపథ్యంలో తమ సేనలకు తాలిబన్ సంస్థ కీలక ఆదేశాలు జారీ చేసింది. క్రమశిక్షణతో నడుచుకోవాలని తమ సాయుధ బలగాలను ఆదేశించినట్లు ఓ సీనియర్ తాలిబన్ అధికారి రాయిటర్స్ సంస్థకు తెలిపారు. ఆఫ్గన్‌లో ఖాళీ అయిన ఏ దేశ ఎంబెసీ (దౌత్య కార్యాలయం)లోనికి ప్రవేశించొద్దని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించింది. అలాగే విదేశీ ఎంబసీ భవంతులకు ఎలాంటి హాని తలపెట్టొద్దని సూచించారు. అలాగే విదేశీ దౌత్య కార్యాలయాలకు సంబంధించిన వాహనాలను కూడా అడ్డుకోవద్దని ఆదేశాలిచ్చారు.

ఆఫ్గన్‌లోని తమ సిబ్బందిపై తాలిబన్లు అఘాయిత్యాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలుంటాయని అమెరికా తదితర దేశాలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో విదేశీ దౌత్యకార్యాలయాల్లోకి వెళ్లొద్దని తమ సాయుధ సేనలకు తాలిబన్ సంస్థ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. కాబుల్‌ను ఆదివారంనాడు తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు..ఆఫ్గనిస్థాన్ పార్లమెంటు భవంతి, అధ్యక్ష భవంతిలో తుపాకులు చేతబట్టి వీడియోల్లో దర్శనమిచ్చారు. దీనిపై అంతర్జాతీయ మీడియాలో తాలిబన్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


అలాగే కొందరు కాబుల్‌లోని ఓ జిమ్‌లో వ్యాయామం చేస్తున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.

ఆఫ్గనిస్థాన్‌లో అమెరికా సేనల పాత మిలిటరీ బేస్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న వీడియో..

Also Read..

వ్యతిరేకులకు క్షమాభిక్ష పెట్టిన తాలిబన్లు.. ప్రభుత్వంలో చేరాలంటూ మహిళలకు పిలుపు..

కాబూల్ విమానాశ్రయంలో ఓ తాలిబన్ ఫైటర్ ఏం చేశాడో చూడాల్సిందే ! ఇదీ వారి క్రూరత్వం !