Afghanistan Blast: ఆఫ్గన్‌ రాజధాని కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. ఇద్దరు రష్యా దౌత్యవేత్తలతోపాటు 20 మంది దుర్మరణం

|

Sep 05, 2022 | 3:00 PM

ఆఫ్గనిస్తాన్‌ రాజధాని కాబూల్‌ ఆత్మాహుతి దాడితో దద్దరిల్లింది. రష్యా ఎంబసీని టార్గెట్ చేస్తూ జరిగిన ఆత్మాహుతి దాడిలో 20 మంది చనిపోయారు.

Afghanistan Blast: ఆఫ్గన్‌ రాజధాని కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. ఇద్దరు రష్యా దౌత్యవేత్తలతోపాటు 20 మంది దుర్మరణం
Bomb Blast
Follow us on

ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు దౌత్యవవేత్తలతోపాటు 20 మంది వరకు మరణించినట్లుగా సమాచారం. రష్యా రాయబార కార్యాలయం వెలుపల సోమవారం  ఈ ఘటన చోటు చేసుకుంది. రష్యా ప్రభుత్వ అనుబంధ మీడియా ఆర్‌టి ఈ వివరాలను అందించింది. వీసాల కోసం దౌత్యకార్యాలయ   గేట్ల వెలుపల ఎదురుచూస్తున్న సమయంలో పేలుడు జరిగినట్లు సమాచారం. దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిపై ఎంబసీ గేట్‌ల వెలుపల తాలిబాన్ గార్డ్‌లు మొదట కాల్పులు జరిపారు. అయితే గార్డులు కాల్చిన వెంటనే తనను తాను పేల్చుకున్నాడు బాంబర్. అయితే పేలుడుకు పాల్పడింది ఎవరన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.