Afghanistan Crisis: ఆఫ్గనిస్థాన్‌లో మహిళల సాహసం.. హక్కుల కోసం వీధికెక్కి తాలిబన్ల ఎదుటే ఆందోళన

|

Aug 18, 2021 | 9:34 PM

Afghanistan Crisis: తాలిబన్ల వేధింపుల తాలలేక వేలాది మంది ఆదేశ ప్రజలు ఆఫ్గనిస్తాన్‌ను వదిలి పారిపోతుండగా.. కొందరు మాత్రం ధీరవనితల్లా మారారు.

Afghanistan Crisis: ఆఫ్గనిస్థాన్‌లో మహిళల సాహసం.. హక్కుల కోసం వీధికెక్కి తాలిబన్ల ఎదుటే ఆందోళన
Afghan Woman
Follow us on

Afghanistan Crisis: తాలిబన్ల వేధింపుల తాలలేక వేలాది మంది ఆదేశ ప్రజలు ఆఫ్గనిస్తాన్‌ను వదిలి పారిపోతుండగా.. కొందరు మాత్రం ధీరవనితల్లా మారారు. ఈ అరాచక మిలిటెంట్లకు వ్యతిరేకంగా పోరాటానికి ఉక్కుపిడికిలి బిగించారు. తమ హక్కులకై డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. మహిళల ఆందోళనలను గమనించిన తాలిబన్లు వారిని చుట్టుముట్టారు. ఇరానియన్ జర్నలిస్ట్ మసీహ్ అలినెజాద్ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో నలుగురు ఆఫ్గన్ మహిళలు కాబుల్ వీధిలో నిలుచుని చేతితో ప్లకార్డులు పట్టకున్నారు. సామాజిక భద్రత, పని హక్కు, విద్యా హక్కు, రాజకీయ భాగస్వామ్యాన్ని వారు కోరుతున్నట్లుగా ఆ ప్లకార్డులలో ఉంది. రాజీపడేది లేదని, తమ ప్రాథమిక హక్కులు తమకు కావాలిన ఆ మహిళలు నినదించారు.

తాలిబన్ల పాలనపై భయాందోళనలో మహిళలు..
ఆదివారం నాడు ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌ను తాలిబన్లు వశం చేసుకున్న తరువాత.. చాలా మంది మహిళలు భయంతో ఆఫ్గనిస్తాన్‌ను వదిలి పారిపోయారు. చాలా దేశాల్లో ఆశ్రయం పొందారు. భారత్‌కు కూడా వచ్చారు. కాబూల్‌కు చెందిన ఓ మహిళ ఢిల్లీలోని తమ సన్నిహితుల ఇంటికి చేరుకుంది. అక్కడి పరిస్థితులపై తీవ్ర భయాందోళన వ్యక్తం చేసింది. తమ స్నేహితులను, బంధువులను తాలిబన్ మిలిటెంట్లు దారుణంగా చంపేశారని, తమను కూడా చంపబోయారని వాపోయింది. తాలిబన్ల పాలనలో ఆఫ్గనిస్తాన్‌లో మహిళలకు ఇక ఎలాంటి హక్కులు ఉండవని, బానిసల్లా బ్రతకాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేసింది బాధిత మహిళ.

ఇదిలాఉంటే.. తాలిబన్ మిలిటెంట్లు చాలా మంది మహిళలను అపహరించి బలవంతంగా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలను తాలిబన్లు తీవ్రంగా ఖండించారు. మహిళల హక్కులను గౌరవిస్తామని, వారికి ఎలాంటి హానీ తలపెట్టబోమని స్పష్టం చేశారు. అయితే, ఇస్లామిక్ చట్టం ప్రకారం నిబంధనలను అమలు చేస్తామని తాలిబన్ ముఖ్యనేతలు ప్రకటించారు.

Twitter Videos:

Also read:

Telangana Corona Cases: తెలంగాణలో స్థిరంగా కరోనా పాజిటివ్ కేసులు.. ఇవాళ ఎన్ని కేసులంటే..

Hyderabad: హైదరాబాద్‌లో గ్యాంగ్ రేప్ కలకలం.. ఆటో ఎక్కిన యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి..

Afghanistan Crisis: ఖజానాను దొంగిలించాడు.. అష్రఫ్‌ ఘనీని అరెస్ట్ చేయండి.. ఇంటర్‌పోల్‌కు ఆఫ్గన్ రాయబార కార్యాలయం ఫిర్యాదు..