ఎవరైనా ఆపదలో ఉంటే వారికి మనవంతు సహాయం చేయడం చూస్తుంటాం. మనకు తోచినంత ఇవ్వడమో, చేతనైనంత చేయడమో వంటివి చేస్తూ ఆసరాగా ఉంటాం. అయితే జంతువుల విషయంలో..మనకు ఎన్నో సందేహాలుంటాయి. అవి పరస్పరం సహాయం చేసుకుంటాయా అని ఆలోచిస్తుంటాయి. అవసరమైనప్పుడు అవి కూడా సహాయం చేసుకుంటాయని కొన్ని వీడియోలు నిరూపితం చేస్తున్నాయి. కానీ జంతువులకు మనుషులు, మనుషులకు జంతువులు సహాయం చేయడాన్ని మనం అప్పుడప్పుడు మాత్రమే చూస్తుంటాం. ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా మనకు సహాయం చేసిన వారికి థాంక్స్ అంటూ చేతులు కలిపి కృతజ్ఞతలు చెబుతాం. లేదా రెండు చేతులూ జోడించి మన కృతజ్ఞతా భావాన్ని చాటుకుంటాం. ఇది మానవ ధర్మం. ఇది జంతువులకూ వర్తిస్తుందంటుంది ఓ గున్న ఏనుగు. అవును. ఆపదలో ఉన్న తనకు సహాయం చేసిన బాలికకు కృతజ్ఞతలు చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. చిన్ని ఏనుగు చేసిన పని నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో రోడ్డు పక్కన ఓ చెరకు పొలాన్ని చూడవచ్చు. పొలంలో చెరకు తినేందుకు వెళ్లింది ఓ గున్న ఏనుగు. ఈ క్రమంలో అదుపు తప్పి బురదలో చిక్కుకుంది. అది పైకి రావడానికి నానా తంటాలు పడుతుంది. ఇంతలో అటుగా తన పెంపుడు కుక్కతో కలిసి వాకింగ్ చేస్తూ వెళ్తున్న బాలిక ఆ చిన్ని ఏనుగుకు సహాయం చేసింది. దాని కాళ్లు పట్టుకొని పైకి లాగింది. దాంతో ఆ చిన్ని ఏనుగు బురదనుంచి పైకి వచ్చింది.
She helped the elephant baby to come out from the mud it was struck in. Baby acknowledges with a blessing ? pic.twitter.com/HeDmdeKLNm
— Susanta Nanda IFS (@susantananda3) October 27, 2022
అనంతరం ఆ బాలిక అక్కడ్నుంచి వెళ్తుండగా ఆ చిన్ని ఏనుగు తన తొండంతో ఆ బాలికను ఆశీర్వదించి కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను వేలాదిమంది నెటిజన్లు వీక్షిస్తూ లైక్ చేస్తున్నారు. అద్భుతమైన సన్నివేశం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..