Crocodile: వామ్మో దారుణం.. 72 ఏళ్ల వృద్ధుడ్ని పీక్కుతిన్న 40 మొసళ్లు.. అసలేం జరిగిందంటే

|

May 26, 2023 | 7:57 PM

మొసలిని చూస్తేనే కొంతమంది హడలెత్తి పోతారు. ఇక దాని దగ్గరికి వెళ్తే ఇంకా ఏమైనా ఉంటుందా గుండె ఆగిపోయేంత పని అవుతుంది. అయితే ఓ 72 ఏళ్ల వృద్ధుడిపై ఏకంగా 40 మొసళ్లు మూకుమ్ముడిగా దాడి చేయడం కలకలం రేపుతోంది. ఈ దుర్ఘటన కంబోడియాలో చోటుచేసుకుంది.

Crocodile: వామ్మో దారుణం.. 72 ఏళ్ల వృద్ధుడ్ని పీక్కుతిన్న 40 మొసళ్లు.. అసలేం జరిగిందంటే
Crocodiles
Follow us on

మొసలిని చూస్తేనే కొంతమంది హడలెత్తి పోతారు. ఇక దాని దగ్గరికి వెళ్తే ఇంకా ఏమైనా ఉంటుందా గుండె ఆగిపోయేంత పని అవుతుంది. అయితే ఓ 72 ఏళ్ల వృద్ధుడిపై ఏకంగా 40 మొసళ్లు మూకుమ్ముడిగా దాడి చేయడం కలకలం రేపుతోంది. ఈ దుర్ఘటన కంబోడియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఓ వృద్ధుడు తన పొలం ఆవరణలో ఉన్న ఎన్‌క్లోజర్లో మొసళ్లు పెంచుతున్నాడు. అందులో ఓ మొసలి గుడ్లు పెట్టడంతో వాటికోసం ఆ మొసలిని ఎన్‌క్లోజర్‌ నుంచి తరలించాలనుకున్నాడు. అందుకోసం ఓ కర్రతో బెదిరిస్తూ పక్కకు తొలగిపోయేలా చేద్దామనుకున్నాడు. కానీ అది రివర్స్‌లో అతని కర్రను బలంగా పట్టుకుని ఎన్‌క్లోజర్‌లోకి లాగింది.

దీంతో ఆ వృద్ధుడు ఎన్‌క్లోజర్‌లోకి పడిపోయాడు. అక్కడున్న 40 మొసళ్లు ఒక్కసారిగా అతనిపై మూకుమ్మడి దాడి చేసి తినేశాయి. ఆ ప్రాంతంలో అతడి ఆవశేషాలు మాత్రమే కనిపించాయి. బాధితుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. చివరికి పోలీసులకు సమాచారం అందించారు. అయితే కంబోడియాలోని సియెమ్‌ రీప్‌ చుట్టూ అనేక మొసళ్లు సంరక్షణ ఎన్‌క్లోజర్‌లు ఉన్నాయి. ఆ ప్రాంతవాసులు ఈ మొసళ్లను వ్యాపారం కోసం పెంచుతుంటారు. వాటి గుడ్లు, మాంసం, చర్మం తదితరాలతో వ్యాపారం చేస్తూ జీవిస్తుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..