పాకిస్తాన్ పై అమెరికా డబుల్ పాలసీ ! ఇదేం దౌత్య నీతి ?

పాకిస్తాన్ పట్ల అమెరికా ముందొక రీతి.. వెనకొక రీతిలా ‘ డబుల్ పాలసీ ‘ పాటిస్తోంది. ఓ వైపు ఆ దేశం టెర్రరిస్టుల స్వర్గధామంగా మారిందని, అక్కడి ఉగ్రవాద శిబిరాలను వెంటనే నియంత్రించాలని, టెర్రరిస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూనే.. మరోవైపు సుతిమెత్తని ధోరణిని కూడా పాటిస్తోంది. కాశ్మీర్ విషయంలో భారత-పాకిస్తాన్ దేశాలు ద్వైపాక్షిక చర్చలు జరపాలని, అవసరమైతే తానీ విషయంలో జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అధ్యక్షుడు ట్రంప్ మాటిమాటికి చెబుతూ వచ్చాడు. […]

పాకిస్తాన్ పై అమెరికా డబుల్ పాలసీ ! ఇదేం దౌత్య నీతి ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 26, 2019 | 6:40 PM

పాకిస్తాన్ పట్ల అమెరికా ముందొక రీతి.. వెనకొక రీతిలా ‘ డబుల్ పాలసీ ‘ పాటిస్తోంది. ఓ వైపు ఆ దేశం టెర్రరిస్టుల స్వర్గధామంగా మారిందని, అక్కడి ఉగ్రవాద శిబిరాలను వెంటనే నియంత్రించాలని, టెర్రరిస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూనే.. మరోవైపు సుతిమెత్తని ధోరణిని కూడా పాటిస్తోంది. కాశ్మీర్ విషయంలో భారత-పాకిస్తాన్ దేశాలు ద్వైపాక్షిక చర్చలు జరపాలని, అవసరమైతే తానీ విషయంలో జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అధ్యక్షుడు ట్రంప్ మాటిమాటికి చెబుతూ వచ్చాడు. అసలు ఈ అంశం తమ దేశ అంతర్గత వ్యవహారమని భారత్ పదేపదే స్పష్టం చేస్తున్నా.. మధ్యవర్తిత్వానికి నేను రెడీ అని అంటున్నాడు. పైగా పాక్ కు ట్రంప్ ప్రభుత్వం సైనిక సాయం చేయడం కూడా విడ్డూరం. ఎఫ్-16 యుధ్ధ విమానాలకు అవసరమైన విడి భాగాలను యుఎస్ ఆ దేశానికి సరఫరా చేసి ‘ తన ఉదార గుణాన్ని ‘ చాటుకుంది. (దీనిపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది కూడా). పాక్ చేపట్టిన ఎఫ్-16 ప్రోగ్రామ్ కి తమ సైనికపరమైన అసిస్టెన్స్ ప్యాకేజీ కొనసాగుతుందని ఆ మధ్య వాషింగ్టన్ ను సందర్శించిన ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ట్రంప్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని ఈ సందర్భంగా విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఎఫ్-16 కార్యక్రమానికి అయ్యే ఖర్చు 125 మిలియన్ డాలర్లని అంచనా. ఫిబ్రవరి 27 న భారత్ చేపట్టిన బాలాకోట్ వైమానిక దాడి అనంతరం..పాక్.. ఎఫ్-16 యుధ్ధ విమానాలను భారత్ దిశగా మోహరించింది. ఇటీవలే కాశ్మీర్ సమస్యపై అమెరికా కాంగ్రెస్ ఫారిన్ ఎఫైర్స్ కమిటీ జరిపిన విచారణ మొత్తం పాకిస్తాన్ కు అనుకూలంగా, ఇండియాకు వ్యతిరేకంగా ఉంది. భారత సీనియర్ జర్నలిస్టు ఆర్తి టికూ సింగ్ ఇదే విషయాన్ని ఆ కమిటీ దృష్టికి తెచ్చ్చారు. ఈ కమిటీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. పాక్ పట్ల ట్రంప్ ప్రభుత్వం ఇలా రెండు నాల్కల వైఖరి పాటించడం అంతుబట్టకుండా ఉందని రాజకీయ నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఇదేం దౌత్య నీతి అని ప్రశ్నిస్తున్నారు.