అమిత్ షా న్యూ స్కెచ్.. బీజేపీలో చేరేవారెవరు.?

Who Will Join BJP In Presence Of Amit Shah From AP And Telangana?, అమిత్ షా న్యూ స్కెచ్.. బీజేపీలో చేరేవారెవరు.?

తెలుగు రాష్ట్రాల్లో బలపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ అందుకు తగ్గట్టుగా లోకల్ నేతలు పనిచేయకపోవడంతో నేరుగా హైకమాండే రంగంలోకి దిగుతోంది. వచ్చే నెల నుంచి ఏపీలో కొత్త స్కెచ్ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గత కొన్ని నెలలుగా ఏపీపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన బీజేపీ.. లోకల్ నేతలను పక్కనపెట్టేసింది. ఎందుకంటే ఏపీ బీజేపీ నేతలకు టైమ్ ఇచ్చినా ఇప్పటి వరకూ టీడీపీ నేతల్ని బీజేపీలోకి తీసుకురాలేకపోయారు. దీంతో పార్టీ సీనియర్ నేతలైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా రంగంలోకి దిగబోతున్నారని తెలుస్తోంది. అందుకు వచ్చే నెలనుంచి ప్రతినెలా ఒకరోజు పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఫిబ్రవరి లోపు టీడీపీతో పాటు ఇతర పార్టీలనుంచి వచ్చేవారితో భారీ చేరికలు చేపట్టాలని చూస్తున్నారు.

ఇక ఏడాది క్రిందట ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న కన్నాలక్ష్మీనారాయణ గత, ప్రస్తుత ప్రభుత్వాలపై విమర్శలు చేయడం, పార్టీ కేడర్‌ను తయారు చేయలేకపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ లోంచి బీజేపీలో చేరేవారి చిట్టా ఉన్నప్పటికీ ఎందుకింత సమయం పడుతోందంటూ.. ఇటీవల హైదారాబాద్‌లో జరిగిన సమావేశంలో కన్నాను నిలదీశారని ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు ఏపీలో అమిత్ పర్యటించినంత మాత్రానా ఏం జరుగుతుందిలే అని కొంతమంది బీజేపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *