టీడీపీ టూ వైసీపీ వయా బీజేపీ..రూట్ ఫిక్స్..!

ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మూడున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన ఆ పార్టీ గత ఎన్నికల్లో ఎన్నడూ ఊహించని ఓటమిని ఎదుర్కుంది. అప్పట్నుంచి నేతలు ఒక్కొక్కరిగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఏకంగా టీడీపీ పార్లమెంటరీ పార్టీనే బీజేపీలో విలీనం అవ్వడం పార్టీ వర్గాలను విపరీతంగా కృంగతీసింది. జగన్ టీడీపీ నేతలను తన పార్టీలో చేర్చుకోడానికి ఇష్టపడకపోవడంతో..నేతలంతా కమలం పార్టీ వైపు క్యూ కడుతున్నారు. తాజాగా గన్నవరం […]

టీడీపీ టూ వైసీపీ వయా బీజేపీ..రూట్ ఫిక్స్..!
Follow us

|

Updated on: Oct 25, 2019 | 9:50 PM

ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మూడున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన ఆ పార్టీ గత ఎన్నికల్లో ఎన్నడూ ఊహించని ఓటమిని ఎదుర్కుంది. అప్పట్నుంచి నేతలు ఒక్కొక్కరిగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఏకంగా టీడీపీ పార్లమెంటరీ పార్టీనే బీజేపీలో విలీనం అవ్వడం పార్టీ వర్గాలను విపరీతంగా కృంగతీసింది. జగన్ టీడీపీ నేతలను తన పార్టీలో చేర్చుకోడానికి ఇష్టపడకపోవడంతో..నేతలంతా కమలం పార్టీ వైపు క్యూ కడుతున్నారు.

తాజాగా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ..బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో భేటీ అయ్యారు. గుంటూరులో బీజేపీ నేత చందు సాంబశివరావు ఇంటికి వచ్చిన సుజనా చౌదరి కాసేపు మీడియాతో మాట్లాడిన అనంతరం..వంశీని వెంటబెట్టుకోని ఒకే కారులో వెళ్లడం ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలో కూాడా ఈ ఇద్దరి నేతలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

అటు జగన్‌తోనూ..

సుజనాతో భేటీ అనంతరం వల్లభనేని వంశీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. దాదాపు అరగంటపాటు ఈ సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. సీఎం జగన్‌కు వంశీ అంటే సానుకూల అభిప్రాయం ఉంది. గతంలో కూడా ఆయనను పలుసార్లు పార్టీలోకి జగన్ ఆహ్వానించినట్టు సమాచారం. సీఎంతో భేటీకి ముందు వంశీ..ఏపీ మినిస్టర్ కోడాలి నానితో కూడా రహస్య మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది.  అయితే సీఎం జగన్  పార్టీలోకి వచ్చేందుకు సుముఖత చూయిస్తున్న ఇతర పార్టీ సెలక్టెడ్  ఎమ్మెల్యేలను రాజీనామా చేసి..రమ్మంటున్న విషయం తెలిసిందే. మరి అటు బీజేపీ..ఇటు టీడీపీ నుంచి ఆఫర్స్ ఉన్న నేపథ్యంలో వంశీ ఇప్పుడు ఎటువైపు దారి ఎన్నుకుంటారన్నది ప్రశ్నార్థంకంగా మారింది. గతంలో పలుమార్లు ఆయన టీడీపీలోనే ఉంటానని స్పష్టంగా చెప్పినా ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వంశీ పార్టీ మార్పు అనివార్యంగా కనిపిస్తోంది.

కానీ రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోన్న మాట మాత్రం వేరేలా ఉంది. బీజేపీ డైరెక్షన్‌లోనే వంశీ అడుగులు వైసీపీ వైపు పడుతున్నాయని సమాచారం. ఈ సస్పెన్స్‌కు తొందరలోనే తెరపడే అవకాశం కనిపిస్తోంది.