విజయనిర్మల కల అలానే మిగిలిపోయింది

నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా భిన్న పాత్రలు పోషించిన విజయనిర్మలకు టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉంది. 44 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆమె.. ఏ మహిళా దర్శకురాలు సాధించలేని ఘనతను సాధించి, గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నారు. అయితే జీవితంలో ఇన్ని విజయాలను సొంతం చేసుకున్నప్పటికీ.. ఆమె అనుకున్న కల మాత్రం నెరవేరలేదు. అదేంటంటే ఆమె 50సినిమాలకు దర్శకత్వం చేయాలనుకున్నారట. ‘మీనా’ చిత్రంతో దర్శకత్వం చేయడం ప్రారంభించిన విజయ నిర్మల 44 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అందులో ఎన్నో […]

విజయనిర్మల కల అలానే మిగిలిపోయింది
Follow us

| Edited By:

Updated on: Jun 28, 2019 | 7:19 AM

నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా భిన్న పాత్రలు పోషించిన విజయనిర్మలకు టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉంది. 44 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆమె.. ఏ మహిళా దర్శకురాలు సాధించలేని ఘనతను సాధించి, గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నారు. అయితే జీవితంలో ఇన్ని విజయాలను సొంతం చేసుకున్నప్పటికీ.. ఆమె అనుకున్న కల మాత్రం నెరవేరలేదు. అదేంటంటే ఆమె 50సినిమాలకు దర్శకత్వం చేయాలనుకున్నారట.

‘మీనా’ చిత్రంతో దర్శకత్వం చేయడం ప్రారంభించిన విజయ నిర్మల 44 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అందులో ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలు ఉన్నాయి. అయితే కృష్ణతో దేవదాస్ మూవీని తీసిన ఆమె.. ఆ సినిమా పరాజయంతో ఇక మూవీలు తీయకూడదని నిర్ణయం తీసుకున్నారట. ఇదే విషయం కృష్ణకు చెబితే, ఆయన ఒప్పుకోలేదట. జయాపజయాలు వస్తుంటాయని, సినిమాలు కొనసాగించాలని సూచించారట. అలా ఆమె 44 సినిమాలకు దర్శకత్వం వహించారట. మధ్యలో అనారోగ్యంతో ఆమె కొంతకాలం విశ్రాంతి తీసుకున్నప్పటికీ.. మళ్లీ ఓ సినిమాకు దర్శకత్వం వహించాలని 2013లో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారట. ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తరువాత ఉమ్మడి కుటుంబాల నేపథ్యంలో సినిమా చేయాలని అనుకున్నారట. కానీ కారణాలు తెలీదు కానీ ఆ ప్రయత్నాలు కార్యరూపం దాల్చలేదు. ఇక ఇప్పుడు మరణంతో 50 సినిమాలు తీయాలన్న ఆమె కోరిక అలానే ఉండిపోయింది.