పడిపోయినా వదల్లేదు.. రెచ్చిపోయిన చైన్‌ స్నాచర్లు

Updated on: Jan 25, 2026 | 4:56 PM

సంగారెడ్డి జిల్లాలో చైన్‌ స్నాచర్లు రెచ్చిపోయారు. తాజాగా జహీరాబాద్‌ పట్టణంలో శ్రావణి అనే మహిళ మెడలోంచి దుండగులు మూడు తులాల బంగారు గొలుసును దారుణంగా లాక్కెళ్లారు. ఆమె కిందపడినా వదలకుండా గొలుసును తెంచారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డు కాగా, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాత్రివేళ దొంగల సంచారంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

సంగారెడ్డి జిల్లాలో చైన్‌ స్నాచర్లు అరాచకం సృష్టిస్తున్నారు. ఒంటరిగా రోడ్లపై వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని బంగారు గొలుసుల చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల గడ్డపోతారం మున్సిపల్ పరిధిలో బాయమ్మ అనే మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసు చోరీ ఘటన జరిగి కొద్దిరోజులు కూడా కాకముందే, తాజాగా జహీరాబాద్ పట్టణంలో మరో చైన్ స్నాచింగ్ ఉదంతం చోటుచేసుకుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైల్వేలో రోబో క్యాప్‌.. విధుల్లోకి అర్జున్‌

షారుఖ్ చేతికి రూ.13 కోట్ల వాచ్.. ఏమిటీ దీని స్పెషాలిటీ ??

కంటి ఆపరేషన్లు చేసే రోబో.. చైనా పరిశోధకుల అద్భుత సృష్టి

జైలుకెళ్లిన భర్తను బెయిలుపై బయటకు తెచ్చి మరీ

ట్రాఫిక్‌ రూల్స్‌ మరింత కఠినం.. 5 దాటితే అంతే సంగతులు..