Posani Krishnamurali: రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..

వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు వీడ్కోలు పలకడమే కాదు.. ఇకపై రాజకీయాల గురించి మాట్లాడనని..

Updated on: Nov 21, 2024 | 8:20 PM

వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు వీడ్కోలు పలకడమే కాదు.. ఇకపై రాజకీయాల గురించి మాట్లాడనని.. తనకు ఏపార్టీతోనూ సంబంధం లేదని వెల్లడించారు. ఇక జీవితంలో ఆఖరి శ్వాస వరకు కుటుంబం కోసమే బతుకుతానని తెలిపారు. ఏ పార్టీ గురించి, నాయకుడి గురించి రాజకీయాలు మాట్లాడనని పోసాని కృష్ణమురళీ చెప్పారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌పై అనుచిత విమర్శలు చేశారని ఆరోపిస్తూ గత కొద్దిరోజులుగా ఆయనపై ఏపీవ్యాప్తంగా కూటమి నేతలు కేసులు పెడుతున్న విషయం తెలిసిందే. కాగా, పోసాని గత ప్రభుత్వంలో ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్‌గా పని చేశారు.