యాదాద్రీశుడికి భారీ ఆదాయం.. ఒక్కరోజు హుండీ ఆదాయం ఎంతో తెలుసా?
కార్తీకమాసం ఆదివారం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. 78,200 మంది భక్తులు దర్శించుకోగా, హుండీకి రికార్డు స్థాయిలో కోటి రూపాయలకు పైగా ఆదాయం లభించింది. ప్రసాద విక్రయాల ద్వారా రూ.27 లక్షలు సమకూరాయి. భక్తుల రద్దీతో సత్యనారాయణ వ్రతాలు, కార్తీక దీపాలు వెలిగించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం ఒక్కరోజే స్వామివారిని 78, 200 మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో స్వామివారి హుండీకి రికార్డుస్థాయిలో ఆదాయం సమకూరింది. అక్షరాలా కోటి యాభైఏడు వేల మూడువందల ఇరవైరెండు రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అలాగే ప్రసాదాల విక్రయం ద్వారా రూ.27, 43, 220 రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ఉన్నట్లు తెలిపారు. కార్తీకమాసం ఆదివారం సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు యాదగిరిగుట్టకి పోటెత్తారు. దీంతో శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ఆలయ మాడవీధులు భక్తులతో సందడిగా మారాయి. ఓవైపు సత్యనారాయణస్వామి వ్రతాలు, మరోవైపు కార్తీక దీపాలు వెలుగులతో ఆలయం శోభిల్లింది. సత్యనారాయణస్వామి వ్రతాలు, బిల్వార్చన, నిజాభిషేకంలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్తీక దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు పెద్దసంఖ్యలో రావడంతో శివాలయం, వ్రత మండపాలు, కార్తీక దీపా రాధన ప్రదేశాలు భక్తులతో కిటకిటలాడాయి. శివకేశవనామస్మరణతో ఆలయప్రాంగణం మారుమోగింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ముగింపు దిశగా అమెరికా షట్‌డౌన్.. ఊపిరి పీల్చుకున్న అమెరికన్లు
వరుస తుఫాన్‌లతో ఫిలిప్పీన్స్ అతలాకుతలం
స్పైస్‌జెట్ విమానానికి తప్పిన పెను ప్రమాదం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
