ఫ్రెండ్ ఫ్రెండే.. బిజినెస్ బిజినెస్సే.. ఇండియాతోనూ ట్రంప్ ట్రేడ్ వార్ ??

Updated on: Jan 23, 2025 | 3:19 PM

ఫ్రెండ్ ఫ్రెండే. రూల్ రూలే. డొనాల్డ్ ట్రంప్ స్టైల్ ఇది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆయనకు మంచి మైత్రి ఉండొచ్చు. కానీ..దేశ ప్రయోజనాల విషయానికొచ్చినప్పుడు మాత్రం..ఎవరినీ లెక్క చేయరు ట్రంప్. "మన" అనుకున్నా సరే..వాళ్లతోనూ కఠినంగానే ఉంటారు. అందుకే ట్రంప్ గెలవగానే అంతర్జాతీయంగా ఒక రకమైన టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా భారత్ ఆయన వైఖరిని చాలా ఆసక్తిగా గమనిస్తోంది.

ఇకపై ఆయన తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని ఇంతే ఆసక్తిగా గమనించాల్సి ఉంటుంది. 2017 నుంచి 2020 వరకూ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు ట్రంప్. ఆ సమయంలో ఫారిన్ పాలసీలో చాలానే మార్పులు తీసుకొచ్చారు. పైగా…అసలు ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకున్నారు. పారిన్ ఒప్పందం నుంచి బయటకు వచ్చేశారు. వెంటనే ఇరాన్ న్యూక్లియర్ డీల్‌ని కూడా పక్కన పెట్టేశారు. ఆ తరవాత నార్త్ కొరియా కిమ్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇలా తన మార్క్ నిర్ణయాలతో దూసుకెళ్లారు. ఈ మూడేళ్లలో ఇండియాతో మంచి మైత్రి పెంచుకున్నారు. ఎన్నో సవాళ్లున్నప్పటికీ…డిఫెన్స్ నుంచి ట్రేడింగ్ వరకూ అన్ని సెక్టార్‌లలోనూ ఇండియా, అమెరికా బంధం బలపడింది. ఇప్పుడు మరోసారి ట్రంప్‌ ప్రెసిడెంట్‌ సీట్‌లోకి వచ్చేశారు. దీన్ని ట్రంప్ 2.0 గా చెబుతున్నారంతా. ఈ హయాంలోనే భారత్, అమెరికా రిలేషన్స్ ఎలా ఉంటాయన్న అనుమానాలతో పాటు..ఇలా ఉండొచ్చేమో అన్న అంచనాలూ మొదలయ్యాయి. అయితే..ఇమిగ్రేషన్ పాలసీ, H1B వీసాలు, గ్రీన్‌కార్డ్‌లు..వీటన్నింటిపైనా ఇప్పటికే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కానీ వీటితో పాటు మరో కీలకమైన విషయం ఒకటి ఉంది. అదే టారిఫ్‌లు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ మొన్నటి స్పీచ్‌లో చేసిన కామెంట్స్‌ని ఇక్కడ ఓసారి గుర్తు చేసుకోవాలి. “విదేశాల పైన టారిఫ్‌లు,ట్యాక్స్‌లు విధిస్తా. అమెరికన్స్‌ని ప్రపంచంలోనే రిచ్‌గా మార్చేస్తా” అని చాలా స్పెషల్‌గా చెప్పారు ట్రంప్. ఇదిగో ఈ స్టేట్‌మెంట్‌ చుట్టూనే తిరుగుతున్నాయి..చర్చలన్నీ. మరో కీలకమైన విషయం ఏంటంటే..ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మెక్సికోతో పాటు కెనడాపై 25% టారిఫ్‌లు విధించేందుకు సిద్ధమవుతున్నారు ట్రంప్. సో..ట్రంప్ 2.0లో ముందుగా ఆ ప్రభావాన్ని ఎదుర్కొనేది ఈ రెండు దేశాలే.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hyderabad: హైదరాబాద్ లో కిడ్నీ రాకెట్ కలకలం

తెలంగాణలో రేషన్‌ కార్డు దారులకు అలర్ట్..

Rashmika Mandanna: అయ్యో.. రష్మికకు ఏమైంది? వీల్‌ ఛైర్‌లో ఇలా..

పుష్ప-2 సినిమా లావాదేవీలపై ఐటీ ఫోకస్‌

Sukumar: డైరెక్టర్ సుకుమార్‌ ఇంట్లో సోదాలు