అమెరికా అధ్యక్ష భవనం ఇక బంగారుమయం

Updated on: Sep 30, 2025 | 9:14 PM

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ రంగు మార్చుకోనుందా.. బంగారు తాపడంతో మెరిసిపోనుందా... అంటే అవుననే అనిపిస్తోంది. పాలరాతి శిల్పంలా స్వచ్ఛమైన తెల్లని రంగులో మెరిసిపోయే వైట్‌హౌస్‌ను బంగారంతో అలంకరించాలని నిర్ణియించినట్టు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు తాపడాలతో వైట్‌హౌస్‌ను అలంకరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు.

ఇందులో భాగంగా వైట్‌హౌస్‌లోని ఓవల్‌ ఆఫీస్‌, క్యాబినెట్‌ రూమ్‌లో పెద్ద ఎత్తున స్వర్ణ అలంకరణలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు అందమైన భవనంగా పేరుపొందిన అధ్యక్ష భవనం ఇకపై అత్యుత్తమమైన భవనంగా విదేశీయులను ఆకట్టుకోనుంది. ఇక్కడికి వచ్చే విదేశీ నేతలను వైట్‌హౌస్‌ విస్తుపోయేలా చేస్తుందని ట్రంప్ తెలిపారు. కార్యాలయంలో అలంకరిస్తున్న మేలిమి అలంకరణల నాణ్యత, సౌందర్యం చూసి ఏ విదేశీ నాయకుడైనా ఆశ్చర్యపోవలసిందేనన్నారు. వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేయనున్న స్వర్ణ అలంకరణలకు సంబంధించిన వీడియోను ట్రంప్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. వీడియోలో బంగారు పూతతో ఉన్న డజన్ల కొద్దీ డిజైన్లు కనిపిస్తున్నాయి. వైట్‌హౌస్‌లో స్వర్ణ తాపడాలు చేయించడానికి ఉపయోగించిన బంగారం ఖర్చును ట్రంప్‌ తనే స్వయంగా భరించినట్లు వైట్ హౌస్ ప్రతినిధి ఇటీవల పేర్కొన్నారు. అయితే ఎంత మొత్తంలో బంగారాన్ని వినియోగిస్తున్నారనే విషయాన్ని వెల్లడించలేదు. ఇప్పటికే ఓవల్‌ ఆఫీస్‌లో పలు చోట్ల స్వర్ణ తాపడాలు ఉన్నాయి. మిగిలిన చోట్ల కూడా బంగారంతో అలంకరించాలని తన కోరిక అని ట్రంప్‌ పలు సందర్భాల్లో వెల్లడించారు. అందుకు అనుగుణంగా ఇప్పుడు చర్యలు చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నా స్టాప్ వచ్చేసింది.. దిగిపోతున్నా

మన అండమాన్‌లో.. భారీ గ్యాస్ నిక్షేపాలు

మూసారాంబాగ్ బ్రిడ్జి ఉండేది అనుమానమే..

ఇక.. మొబైల్‌ తరహాలో గ్యాస్‌ పోర్టబులిటీ

డ్వాక్రా మహిళలకు గుడ్‌ న్యూస్‌.. 10 రోజుల్లో 2 కొత్త పథకాలు